Share News

కంపెనీల్లో మహిళా డైరెక్టర్లు.. నిబంధన లేదు

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:37 AM

గత నెల 15 నాటికి రూ.100 కోట్ల మూలధనం అంతకంటే ఎక్కువ, లేదా రూ.300 కోట్లు అంతకంటే ఎక్కువ టర్నోవర్‌తో దేశవ్యాప్తంగా 1,708 లిస్టెడ్‌ కంపెనీలు,

కంపెనీల్లో మహిళా డైరెక్టర్లు.. నిబంధన లేదు

ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నకు కేంద్రం బదులు

న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): గత నెల 15 నాటికి రూ.100 కోట్ల మూలధనం అంతకంటే ఎక్కువ, లేదా రూ.300 కోట్లు అంతకంటే ఎక్కువ టర్నోవర్‌తో దేశవ్యాప్తంగా 1,708 లిస్టెడ్‌ కంపెనీలు, 3,383 అన్‌లిస్టెడ్‌ పబ్లిక్‌ కంపెనీలు ఉన్నాయని టీడీపీపీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కార్పొరేట్‌ వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి హర్ష మల్హోత్రా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్‌ బోర్డుల్లో లింగవైవిధ్యంపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించగా.. నిర్దేశిత కంపెనీలకు కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ కలిగి ఉండాలని తప్పనిసరి చేసే నిబంధనలేవీ లేవని కేంద్ర మంత్రి చెప్పారు.

Updated Date - Dec 03 , 2024 | 03:37 AM