Share News

సమాజాన్ని మోదీ విభజిస్తున్నారు

ABN , Publish Date - Nov 16 , 2024 | 03:59 AM

ప్రధాని మోదీ తన ప్రసంగాలతో సమాజాన్ని విభజిస్తున్నారని ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఆరోపించారు.

సమాజాన్ని మోదీ విభజిస్తున్నారు

పుణె, నవంబరు 15: ప్రధాని మోదీ తన ప్రసంగాలతో సమాజాన్ని విభజిస్తున్నారని ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఆరోపించారు. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి అధికారంలోకి రానుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం అజిత్‌పవార్‌ను తిరిగి కలుపుకొనే అవకాశంపై ప్రశ్నించగా, అలాంటి అవకాశమే లేదన్నారు. బీజేపీతో కలిసి ఉన్నవారితో తనకు ఏ విధమైన సంబంధమూ లేదని తేల్చిచెప్పారు. అజిత్‌పవార్‌ వెంట వెళ్లిపోయిన నేతలను ‘ద్రోహులు’గా ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో గెలుపు కోసం మహాయుతి కూటమి భారీగా ధనాన్ని వెదజల్లుతోందని శరద్‌ పవార్‌ ఆరోపించారు.

Updated Date - Nov 16 , 2024 | 03:59 AM