Share News

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్.. అతనికి బెయిల్ మంజూరు

ABN , Publish Date - Jul 12 , 2024 | 09:50 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్‌లో(NEET Paper Leak) ఇప్పటికే కీలక నిందితులు అరెస్ట్ అయ్యారు. అయితే తనను సీబీఐ అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన గంగాధర్‌.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్.. అతనికి బెయిల్ మంజూరు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్‌లో(NEET Paper Leak) ఇప్పటికే కీలక నిందితులు అరెస్ట్ అయ్యారు. అయితే తనను సీబీఐ అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన గంగాధర్‌.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అతని పిటిషన్‌పై విచారించిన కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. నీట్ పేపర్ లీక్ కేసులో గంగాధర్‌ను జూన్ 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.


అతనిపై తొలుత లాతూర్ పోలీసులు శివాజీ నగర్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ తరువాత కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది. సీబీఐ, నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు గంగాధర్‌కు రూ.25 వేల ష్యూరిటీ బాండ్‌పై బెయిల్ మంజూరు చేసింది. గంగాధర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... నీట్ పేపర్ లీకేజ్ కేసులో సీబీఐ వెతుకుతున్న వ్యక్తి గంగాధర్ కాదని తెలిపారు. దీంతో కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు.


మరో నిందితుడి అరెస్ట్

నీట్ ప్రవేశ పరీక్ష పత్రం లీక్ కేసులో రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌ అనే మరో నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) గురువారం అదుపులోకి తీసుకుంది. బిహార్‌లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు.

అతను నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాసి చింటూ మొబైల్‌కు పంపాడు. రాకీని పట్టుకునేందుకు పట్నా, కోల్‌కతా సమీపంలోని పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. అతని భార్య ఇమెయిల్ ID ఐపీ అడ్రస్ ద్వారా రాకీని పట్టుకోగలిగారు.అరెస్టు అనంతరం కోర్టులో రాకీని హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం సీబీఐ అతనికి10 రోజుల రిమాండ్‌ను మంజూరు చేసింది. అతను ఇప్పటికే కొన్ని పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

For Latest News and National News

Updated Date - Jul 12 , 2024 | 09:51 PM