Share News

సుప్రీంకోర్టులో న్యాయదేవత కొత్త విగ్రహం!

ABN , Publish Date - Oct 17 , 2024 | 06:57 AM

సుప్రీంకోర్టులో కొన్ని మార్పులతో కొత్త న్యాయదేవత (లేడీ ఆఫ్‌ జస్టిస్‌) విగ్రహం దర్శనమిచ్చింది. చట్టం గుడ్డిది కాదన్న సందేశా న్నిచ్చేలా న్యాయదేవత కళ్లకు కట్టి ఉండే నల్ల

సుప్రీంకోర్టులో న్యాయదేవత  కొత్త విగ్రహం!

చట్టం గుడ్డిది కాదన్న సందేశాన్నిచ్చేలా కళ్లకు గంతల తొలగింపు

చేతిలో ఖడ్గం స్థానంలో రాజ్యాంగం

న్యూఢిల్లీ, అక్టోబరు 16: సుప్రీంకోర్టులో కొన్ని మార్పులతో కొత్త న్యాయదేవత (లేడీ ఆఫ్‌ జస్టిస్‌) విగ్రహం దర్శనమిచ్చింది. చట్టం గుడ్డిది కాదన్న సందేశా న్నిచ్చేలా న్యాయదేవత కళ్లకు కట్టి ఉండే నల్ల రిబ్బన్‌ను తొలగించడంతో పాటు అన్యాయాన్ని శిక్షించడంలో ప్రతీకగా నిలిచే చేతిలోని ఖడ్గం స్థానంలో రాజ్యాంగాన్ని కొత్త విగ్రహంలో చేర్చారు. న్యాయదేవత మరో చేతిలా కనిపించే త్రాసును అలాగే ఉంచారు. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల గ్రంథాలయంలో ఈ కొత్త విగ్రహం కనిపించింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆదేశాల మేరకు న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేసినట్లు సమాచారం. బ్రిటిష్‌ వలసవాద చట్టాలకు స్వస్తి పలుకుతూ కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో న్యాయ దేవత విగ్రహంలోనూ మార్పులు చేయాలని గతంలోనే జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. ‘న్యాయదేవత కళ్లకు గంతలు అవసరం లేదు. చట్టం ఎప్పుడు గుడ్డిది కాదు. అది అందరినీ సమానంగా చూస్తుంది. కత్తి హింసకు ప్రతీకగా కనిపిస్తోంది. కానీ న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల మేరకు న్యాయాన్ని అందజేస్తాయి’ అని అన్నారు.

Updated Date - Oct 17 , 2024 | 06:57 AM