Share News

Engineer Rashid: ఎంపీగా ప్రమాణానికి ఎన్ఐఏ ఓకే.. తేదీ ఎప్పుడంటే..?

ABN , Publish Date - Jul 01 , 2024 | 08:11 PM

ఉగ్రవాదులకు నిధుల అందజేస్తున్నాడనే కారణంగా అరెస్టయిన ఇంజినీర్ రషీద్.. లోక్‌సభలో సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అనుమతిచ్చింది. దీంతో అతడు ప్రమాణం చేసే తేదీని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఖరారు చేయనుంది.

Engineer Rashid: ఎంపీగా ప్రమాణానికి ఎన్ఐఏ ఓకే.. తేదీ ఎప్పుడంటే..?
Sheikh Abdul Rashid, popularly known as Engineer Rashid

న్యూఢిల్లీ, జులై 01: ఉగ్రవాదులకు నిధుల అందజేస్తున్నాడనే కారణంగా అరెస్టయిన ఇంజినీర్ రషీద్.. లోక్‌సభలో సభ్యుడిగా ప్రమాణం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అనుమతిచ్చింది. దీంతో అతడు ప్రమాణం చేసే తేదీని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఖరారు చేయనుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర కాశ్మీర్‌ బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా ఇంజినీర్ రషీద్ బరిలోకి దిగారు. ఆయన సమీప ప్రత్యర్థి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై దాదాపు రెండు లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో రషీద్ విజయం సాధించారు.

Also Read: Ashwini Vaishnaw: రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

Also Read: AP: పలువురు పోలీస్ ఉన్నతాధికారులు మాతృశాఖకు బదిలీ


అయితే జూన్ 24వ తేదీన ఎంపీలంతా ప్రమాణం చేశారు. కానీ 2019లో ఉగ్రవాదులకు నిధులు సేకరించి అందజేస్తున్నాడనే కారణంగా రషీద్‌ను తీవ్రవాద వ్యతిరేక సంస్థ అరెస్ట్ చేసింది. ఇక తాను లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేయాలని.. అందుకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇంజినీర్ రషీద్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో అతడు ఎంపీగా ప్రమాణం చేసే అంశంపై జులై 1వ తేదీ లోపు స్పందించాలని ఎన్‌ఐఏను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఆ క్రమంలో ఎన్ఐఏ ఈ రోజు స్పందించింది.

Also Read: Who is Awadhesh Prasad: రాహుల్ గాంధీ ‘ఆయనకు’ ఎందుకు షేక్‌హ్యాండ్ ఇచ్చారు?

Also Read: INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన


మరోవైపు ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం మీడియాతో ఎంపీ రషీద్ మాట్లాడకుండా షరతు విధించాలని కోర్టును ఎన్ఐఏ ఈ సందర్భంగా కోరింది. ఎంపీగా అతడు ప్రమాణం చేయడానికి జులై 5,6,7 తేదీల్లో ఒక రోజును ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసే అవకాశముందని సమాచారం. జమ్ము కాశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో ఇంజినీర్ షేక్ అబ్దుల్ రషీద్ అరెస్టయ్యారు. అతడిపై అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (యూఏపీఏ) కింద కేసు నమోదు అయింది. నాటి నుంచి రషీద్ తీహాడ్ జైల్లో ఉన్నారు.

Also Read: Viral Video: ‘ఆ వీడియో’పై సీఎంను నివేదిక కోరిన గవర్నర్

Also Read: Australia: స్టూడెంట్ వీసా ఛార్జీలు భారీగా పెంపు.. ఈ రోజు నుంచి అమలు

For More National News and Latest Telugu News click here

Updated Date - Jul 01 , 2024 | 08:11 PM