Share News

Hardeep Singh Nijjar: కెనడా వైఖరిపై స్పందించిన విదేశాంగ శాఖ

ABN , Publish Date - May 09 , 2024 | 08:16 PM

ఖలిస్థాన్ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయులను కెనడా అరెస్ట్‌ చేసింది. ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ గురువారం స్పందించారు.

Hardeep Singh Nijjar: కెనడా వైఖరిపై స్పందించిన విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ, మే 09: ఖలిస్థాన్ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయులను కెనడా అరెస్ట్‌ చేసింది. ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ గురువారం స్పందించారు. ఈ కేసులో భారతీయుల అరెస్ట్‌పై తమకు కెనడా అధికారిక సమాచారమేమి ఇవ్వలేదని స్పష్టం చేశారు.

AP Elections 2024: కర్నూలు ‘సిటీ’ని ఏలేదెవరు..?

ఈ రోజు వరకు అందుకు సంబంధించిన ఆధారం కానీ... సమాచారం కానీ కెనడా అధికారిక వర్గాలు తమతో పంచుకోలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో కెనడా వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్బంగా ఆయన ఎండగట్టారు. ఈ తరహా చర్యల వల్ల.. వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు రాజకీయ అవకాశం కల్పించినట్లు అవుతుందని ఆందన్నారు. ఇక కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలు ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Delhi Liquor Policy Case: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. వ్యతిరేకించిన ఈడీ


అలాగే భారత్‌లో నేరాలకు పాల్పడి కెనడాలో నివసిస్తున్న వారి గణాంకాలతో సహ కెనడా అధికార వర్గాలకు అందించామన్నారు. వారిని అప్పగించాలని చాలా విజ్జప్తులు చేశామని.. వాటి కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాలన్నీ దౌత్య స్థాయిలో చర్చల జరుగుతున్నాయన్నారు. మరోవైపు వేర్పాటు వాదులకు రాజకీయ అవకాశం కల్పించడం కెనడాకు ఇది తొలిసారి కాదని ఆయన పేర్కొన్నారు.

AP Assembly Elections: ఎమ్మిగనూరులో గెలుపు ఎవరిది..?

ఇక హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో గత వారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడే చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా తొసిపుచ్చారు. గతేడాది కెనడాలో ఖలిస్థాన్ తీవ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపారు. దీంతో ముగ్గురు భారత జాతీయులను కెనడ అరెస్ట్ చేసింది. వారిపై కుట్ర, హత్య కేసు నమోదు చేసింది. అయితే నిజ్జర్‌ హాత్యలో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని గతంలో ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ తొసిపుచ్చింది. అలాగే ఇవి అసంబద్దమైన వ్యాఖ్యలను కొట్టి పారేసింది.

Read Latest National News And Telugu News

Updated Date - May 09 , 2024 | 08:16 PM