‘ఎన్నికల బాండ్ల రద్దు’పై సమీక్ష అక్కర్లేదు
ABN , Publish Date - Oct 06 , 2024 | 05:20 AM
ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలుచేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన
న్యూఢిల్లీ, అక్టోబరు 5: ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలుచేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. పార్టీలకు విరాళాల బాండ్లు జారీ చేయడాన్ని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ తీర్పును సమీక్షించాలంటూ న్యాయవాది మాథ్యూస్ నెడుంపర, మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును సమీక్షించాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది.