Rajnath Singh: తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయా
ABN , Publish Date - Apr 11 , 2024 | 08:05 PM
దేశంలో ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఎమర్జెన్సీ సమయంలో తన వయస్సు 23 ఏళ్లని.. ఆ వయస్సులో తనను కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాటు జైల్లో పెట్టిందన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్11: దేశంలో ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) నిప్పులు చెరిగారు. ఎమర్జెన్సీ (Emergency) సమయంలో తన వయస్సు 23 ఏళ్లని.. ఆ వయస్సులో తనను కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాటు జైల్లో పెట్టిందన్నారు. అదే సమయంలో తన తల్లి మరణించిందని.. అయితే ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తనకు ఈ కాంగ్రెస్ పార్టీ పేరోల్ కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
Abhishek Banerjee: అమిత్ షా బెంగాల్‌కి రండి.. అభిషేక్ సవాల్
అలాంటి కాంగ్రెస్ పార్టీ నేడు బీజేపీ వాళ్లను నియంతలుగా అభివర్ణిస్తుందని మండిపడ్డారు. గురువారం న్యూఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని దేశంపై బలవంతంగా రుద్దీ.. ఆ సమయంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఎండగట్టారు.
మరోవైపు ప్రధాన నరేంద్ర మోదీ.. గతేడాది జూన్‌లో దేశంలో ఎమర్జెన్సీ విధించి 48 ఏళ్లు పూర్తైన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన 21 మాసాలు.. మరిచి పోలేని కాలమని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకంగా జరిగిందన్నారు. అదే సమయంలో దేశంలో ఎంతో ధైర్యవంతులు మరణించారని.. వారికి ఈ సందర్భంగా ఆయన శ్రద్దాంజలి ఘటించాని గుర్తు చేశారు.
LokSabha Elections: బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు..
ఇది చరిత్రలో మరిచిపోలేని కాలమన్నారు. ఇంకా చెప్పాలంటే.. అవి చీకటి రోజులు అని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకంగా ఇది జరిగిందన్నారు. గతేడాది ప్రధాని మోదీ జర్మనీ పర్యటనలో భాగంగా.. అక్కడ స్థిరపడిన భారతీయులతో భేటీ అయ్యారని.. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ నల్లని మచ్చ అని ఆయన పేర్కొన్నారని రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు.
జాతీయ వార్తలు కోసం..