One country - One Election: జమిలి ఎన్నికలకు ఓకే అంటే.. నెక్ట్స్ జరిగేదిదే..!
ABN , Publish Date - Mar 14 , 2024 | 06:24 PM
Simultaneous polls: ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోనే హైలెవల్ కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(President of India Droupadi Murmu) అందజేశారు. ఈ నివేదికలో దేశంలో జమిలి ఎన్నికలు(Jamili Elections) సాధ్యమేనని కమిటీ స్పష్టం చేసింది. 2029 దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించొచ్చని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే..
Simultaneous polls: ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలోనే హైలెవల్ కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు(President of India Droupadi Murmu) అందజేశారు. ఈ నివేదికలో దేశంలో జమిలి ఎన్నికలు(Jamili Elections) సాధ్యమేనని కమిటీ స్పష్టం చేసింది. 2029 దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించొచ్చని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే.. 2029లో దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో(Lok Sabha Elections) పాటే.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే, ఈ ఎన్నికల నిర్వహణ అంత ఆశామాషీ ఏం కాదని నిపుణులు చెబుతున్నారు. భారీ వ్యయంతో పాటు.. పెద్ద సంఖ్యలో అధికార గణం అవసం అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతకంటే ముందు.. జమిలి ఎన్నికలను అమలు చేయాలంటే రాజ్యాంగంలో పలు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఓకే అయితే.. అసలైన సవాల్ మరోటి ఉంది. అదేంటంటే..
అందరిలో మెదిలే ప్రశ్న..
ఇవాళో రేపో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ చివరలో గానీ, మే మొదటి వారంలో గానీ ఎన్నికలు జరుగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటే.. 5 రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. అంటే మళ్లీ ఐదేళ్ల తరువాత 2029లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒకవేళ జమిలి ఎన్నికలకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే.. అప్పుడు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనే సందేహం సహజంగానే అందరిలోనూ ఉంటుంది.
అయితే పొడగింపు.. లేదంటే రద్దు..
జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తే.. జూన్ 2024 - మే 2029 మధ్య ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం 18వ లోక్‌సభతో ముగుస్తుంది. అంటే ఈ వన్-టైమ్ ఎన్నికల కసరత్తులో కొన్ని అసెంబ్లీల పదవీకాలం ఐదేళ్ల లోపే ఉంటుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం జూన్ 2024, మే 2029 మధ్య ముగుస్తుంది. అంటే కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి ఎక్కువ సమయం దొరకదు. ఉదాహరణకు తెలంగాణలో రేవంత్ సర్కార్ డిసెంబర్ 2023లో ఏర్పాటైంది. అంటే 2028 నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించి.. డిసెంబర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కానీ, జమిలి ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ గడువును పొడగించడం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం గడువు మే 2029 దాటి ఉన్నట్లయితే.. ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు పోవాల్సి ఉంటుందన్నమాట.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..