Share News

External Affairs Ministry :పాస్ట్‌పోర్ట్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం.. ఎన్ని రోజులంటే..

ABN , Publish Date - Aug 29 , 2024 | 10:04 AM

ఆన్‌లైన్ పాస్ పోర్ట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఈ రోజు నుంచి అంటే.. ఆగస్ట్ 29వ తేదీ రాత్రి 8.00 గంటల నుంచి ఈ సేవలు నిలిపియేనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6.00 గంటలకు ఈ సేవలు పునరుద్దరించ బడతాయని పేర్కొంది.

External Affairs Ministry :పాస్ట్‌పోర్ట్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం.. ఎన్ని రోజులంటే..

న్యూఢిల్లీ, ఆగస్ట్ 29: ఆన్‌లైన్ పాస్ పోర్ట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఈ రోజు నుంచి అంటే.. ఆగస్ట్ 29వ తేదీ రాత్రి 8.00 గంటల నుంచి ఈ సేవలు నిలిపియేనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6.00 గంటలకు ఈ సేవలు పునరుద్దరించ బడతాయని పేర్కొంది. సేవల నిర్వహాణలో భాగంగా పాస్ పోర్ట్ సేవలను నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది.

Also Read: Jharkhand: ‘ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర’


ఇప్పటికే ఈ అయిదు రోజుల్లో ముందుగా షెడ్యూల్ కేటాయించిన వారికి.. మరో తేదీతోపాటు సమయాన్ని సైతం ఖరారు చేస్తామని తెలిపింది. ఇక ఆగస్ట్ 30వ తేదీన ముందుగా పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఇప్పటికే రద్దు చేసినట్లు తెలిపింది. మరో తేదీలతో వారికి అపాయింట్‌మెంట్లు కేటాయిస్తామని.. అందుకు సంబంధించి వారి ఫోన్లకు సందేశాలు పంపుతామని చెప్పింది. పాస్ పోర్ట్ సేవలు తాత్కాలిక నిలిపివేత అంశాన్ని గమనించాలని పలు ప్రభుత్వ శాఖలకు కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది. ఇదంతా సాధారణ ప్రక్రియలో భాగమని పేర్కొంది.

Also Read: Haryana: సీఎం వ్యవహారంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్


పాస్‌పోర్ట్ సేవా పోర్టల్.. కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి లేకుంటే పాస్‌పోర్ట్‌ పునరుద్ధరించడానికి దేశవ్యాప్తంగా కేంద్రాలలో అపాయింట్‌మెంట్‌లను బుక్ చేయడానికి ఉపయోగించబడుతుంది. పాస్ పోర్ట్ అపాయింట్‌మెంట్ తేదీ ఖరారైన రోజు.. దరఖాస్తుదారులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ సమయంలో ధృవీకరణ కోసం వారికి సంబంధించిన అన్ని పత్రాలను అందించాల్సి ఉంటుంది. అనంతరం దీనిపై పోలీసు శాఖ విచారణ జరిపి ధృవీకరణ చేస్తుంది. ఆ తర్వాత దరఖాస్తుదారు చిరునామాకు పాస్‌పోర్ట్ చేరుతుంది.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 29 , 2024 | 10:17 AM