Share News

పది అగ్రశ్రేణి సైనిక శక్తుల్లో పాక్‌!

ABN , Publish Date - Dec 03 , 2024 | 04:06 AM

ప్రపంచంలోని పది అగ్రశ్రేణి సైనిక శక్తుల్లో ఒకటిగా పాకిస్థాన్‌ నిలిచింది. పలు విభాగాల్లో భారత్‌ కంటే కూడా ముందంజలో ఉంది.

పది అగ్రశ్రేణి సైనిక శక్తుల్లో పాక్‌!

న్యూఢిల్లీ, డిసెంబరు 2: ప్రపంచంలోని పది అగ్రశ్రేణి సైనిక శక్తుల్లో ఒకటిగా పాకిస్థాన్‌ నిలిచింది. పలు విభాగాల్లో భారత్‌ కంటే కూడా ముందంజలో ఉంది. ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌ కథనం మేరకు ప్రపంచంలోని 9వ అతిపెద్ద మిలిటరీ శక్తిగా పాకిస్థాన్‌ నిలిచింది. ఆ దేశం వద్ద వేలాదిగా యుద్ధ ట్యాంకులు, యుద్ధ వాహనాలు, యుద్ధ విమానాలు ఉన్నాయి. ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. పాక్‌లో 6.54 లక్షల మంది సైనికులు, 1,434 సైనిక విమానాలు, 387 ఫైటర్‌ జెట్‌లు ఉన్నాయి. భారత్‌, పాక్‌ రెండూ అణ్వస్త్ర దేశాలే. సిప్రి నివేదిక ప్రకారం 2024 జనవరి నాటికి భారత్‌ వద్ద 172, పాకిస్థాన్‌ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు నాలుగు సార్లు భారత్‌తో యుద్ధానికి దిగగా, ప్రతి సందర్భంలోనూ భారత సైన్యం చేతిలో పాకిస్థాన్‌కు భంగపాటు ఎదురైంది.

Updated Date - Dec 03 , 2024 | 04:06 AM