Fake Aadhaar: ఫేక్ ఆధార్ కార్డులతో పార్లమెంటులోకి.. భద్రతా బలగాలు ఏం చేశాయంటే
ABN , Publish Date - Jun 07 , 2024 | 07:42 AM
పార్లమెంటు భవనంలోకి ఫేక్ ఆధార్ కార్డులతో(Fake Aadhaar) ప్రవేశించేందుకు జరిగిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హై-సెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు కార్మికులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) సిబ్బంది పట్టుకున్నారు.
ఢిల్లీ: పార్లమెంటు భవనంలోకి ఫేక్ ఆధార్ కార్డులతో(Fake Aadhaar) ప్రవేశించేందుకు జరిగిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హై-సెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి గేట్ నంబర్ 3 ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు కార్మికులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) సిబ్బంది పట్టుకున్నారు. ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి.
కార్మికులను ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఖాసిం, మోనిస్, షోయబ్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. ఐపీసీలోని ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, మోసానికి సంబంధించిన సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురూ తమ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి కార్డులపై సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానం వచ్చింది.
వాటిని తనిఖీ చేయగా అవి ఫేక్ అని తేలాయి.పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోపల ఎంపీ లాంజ్ నిర్మాణం కోసం 'డీవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్' ముగ్గురు కార్మికులను నియమించుకున్నట్లు అధికారులు తెలిపారు.
భద్రతా సిబ్బంది మార్పు..
2023 డిసెంబర్ 13 న ఇద్దరు యువకులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి ప్రజాప్రతినిధులు ఉన్న గ్యాలరీలోకిదూకి, కలర్ స్మోక్‌ను విడుదల చేశారు. ఆ సమయంలో హాలు మొత్తం పొగతో నిండిపోయింది. అప్పటి నుంచి పార్లమెంట్ భద్రతను పెంచారు. నిందితులను భద్రతా దళాలు పట్టుకున్నాయి.
వారితో పాటు, ఇతర సహచరులను కూడా అరెస్టు చేశారు. అలా ఈ కేసులో ఇప్పటి వరకు 6 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు భద్రతను మార్చింది. సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీసు బృందాల స్థానంలో సీఐఎస్‌ఎఫ్‌కి ఇటీవల పార్లమెంటు భవనం భద్రత బాధ్యతలు అప్పగించారు.
For Latest News and National News click here