PM Modi: ఎన్నికల యుద్ధంలోకి ప్రధాని మోదీ.. తొలి సభ ఎప్పుడంటే
ABN , Publish Date - Mar 08 , 2024 | 05:13 PM
లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections 2024) యుద్ధానికి ప్రధాని మోదీ(PM Modi) సిద్ధం అవుతున్నారు. 370 సీట్లలో ఘనవిజయమే లక్ష్యంగా ఆయన ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఆయనతోపాటు బీజేపీ(BJP) అగ్ర నేతలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మార్చి 25న హోలీ పండగ ముగిశాక మోదీ ప్రచార బరిలో దిగే అవకాశం ఉంది.
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) యుద్ధానికి ప్రధాని మోదీ(PM Modi) సిద్ధం అవుతున్నారు. 370 సీట్లలో ఘనవిజయమే లక్ష్యంగా ఆయన ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఆయనతోపాటు బీజేపీ(BJP) అగ్ర నేతలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మార్చి 25న హోలీ పండగ ముగిశాక మోదీ ప్రచార బరిలో దిగే అవకాశం ఉంది.
ఎన్నికల సభలతో పాటు చాలా చోట్ల రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 150 సభలు, రోడ్ షోలు నిర్వహించేలా బీజేపీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దక్షిణ భారత్‌లో 35 - 40 సభలు, ర్యాలీలు, అసోంలో 1- 2సభలు, యూపీలో 15 కంటే ఎక్కువ సభలు, రోడ్ షోలు మిగిలిన రాష్ట్రాల్లో ప్రాధాన్యత క్రమంలో సభలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ వారణాసిలో నామినేషన్ సమర్పించిన అనంతరం అక్కడే రోడ్ షో నిర్వహించేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.
మోదీతో సహా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా యూపీ సహా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, అసోం సీఎం హేమంత్ బిస్వ శర్మ యూపీ, బిహార్‌లో ప్రచారంలో పాల్గొంటారు.
ఏకకాలంలో అనేక ప్రాంతాలను చుడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని బీజేపీ భావిస్తోంది.
మరిన్నివార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.