Share News

Olympics 2024: వినేశ్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Aug 07 , 2024 | 01:31 PM

వినేశ్.. నువ్వు చాంపియన్లకే చాంపియన్. నీవు భారత్‌కే గర్వకారణం. అలాగే ప్రతీ భారతీయకుడికి నీవు స్పూర్తిదాయం. ఈ రోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ తనను బాగా బాధిస్తుంది. దీనిని వ్యక్తం చేసేందుకు తన వద్ద మాటలు సైతం లేవు. ఈ బాధ నుంచి తిరిగి బయటకు రాగలవని ఆశిస్తున్నాను. సవాళ్లను ఎదిరించడం నీకు తెలుసు.

Olympics 2024: వినేశ్‌పై అనర్హత వేటు.. స్పందించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, ఆగస్ట్ 07: ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడంపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. వినేశ్.. నువ్వు చాంపియన్లకే చాంపియన్. నీవు భారత్‌కే గర్వకారణం. అలాగే ప్రతీ భారతీయకుడికి నీవు స్పూర్తిదాయం. ఈ రోజు నీకు తగిలిన ఎదురు దెబ్బ తనను బాగా బాధిస్తుంది. దీనిని వ్యక్తం చేసేందుకు తన వద్ద మాటలు సైతం లేవు. ఈ బాధ నుంచి తిరిగి బయటకు రాగలవని ఆశిస్తున్నాను. సవాళ్లను ఎదిరించడం నీకు తెలుసు. ఆ క్రమంలో నీకు అండగా మేముంటామన్నారు.


50 కేజీల విభాగంలో వినేశ్ ఫోగట్ నిర్ణీత బరువు పెరిగారు. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు పెరగడంతో వినేశ్‌పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు పారిస్ ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు. వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటంతో క్రీడాభిమానులు భారీ షాక్‌కు గురయ్యారు. బంగారు పతకం సాధించడానికి కేవలం అడుగు దూరంలో ఉండగా ఇలా జరిగిందని సర్వత్ర ఆవేదన వ్యక్తమవుతుంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 07 , 2024 | 01:55 PM