NTR Birth Anniversary: ఎన్టీఆర్‌ను స్మరించుకున్న ప్రధాని మోదీ
ABN , Publish Date - May 28 , 2024 | 05:58 PM
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సేవలను ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
న్యూఢిల్లీ, మే 26: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సేవలను ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన ధరించిన పాత్రలను, ఆయన నాయకత్వ పటిమను ఇప్పటికీ తలచుకుంటారు ఆయన అభిమానులు. ఆయన కలలు కన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తామని మోదీ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. మరోవైపు ఎన్టీఆర్‌పై ప్రధాని మోదీ చేసిన ట్విట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు.
వెండితెర మీద కథనాయకుడిగా, రాజకీయాల్లో మహానాయకుడిగా ఎన్టీఆర్ వెలుగు లీనారు. తెలుగు చిత్ర సీమలో ఎన్టీఆర్ తనకుంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్లు అంటూ తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించారు. తెలుగు దేశం పిలుస్తుంది రా కదలి రా అంటూ ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చి.. కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని అందుకున్నారు.
LokSabha Elections: దోస్తి.. కుస్తి
అలా హస్తం పార్టీ చేతిలోని అధికారాన్ని తన హస్తగతం చేసుకున్న ఎన్టీఆర్.. తెలుగువాడిలోని వాడి వేడిని దేశ రాజధాని హస్తినలోని హస్తం పార్టీ అధిష్టానానికి రుచి చూపించిన ఒకే ఒక్కడు.. ముడు అక్షరాల మహా శక్తి ఎన్టీఆర్. ఆ మహాపురుషుడి శతజయంతి వేడుకలు గతేడాది ముగిసిన సంగతి తెలిసిందే.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News