PM Modi: 2 లక్షల మంది మహిళలతో భారీ సభ.. ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ABN , Publish Date - Jan 02 , 2024 | 03:33 PM
రానున్న లోక్ సభ ఎన్నికల సమరానికి ప్రధాని మోదీ(PM Modi) సన్నద్ధమవుతున్నారు. బుధవారం ఆయన కేరళ(Kerala)లోని త్రిసూర్ లో మహిళలనుద్దేశించి ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి 2 లక్షల మంది వనితలు హాజరవుతారని అంచనా.
తిరువనంతపురం: రానున్న లోక్ సభ ఎన్నికల సమరానికి ప్రధాని మోదీ(PM Modi) సన్నద్ధమవుతున్నారు. బుధవారం ఆయన కేరళ(Kerala)లోని త్రిసూర్ లో మహిళలనుద్దేశించి ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి 2 లక్షల మంది వనితలు హాజరవుతారని అంచనా. ఈ కార్యక్రమంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళా సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను ప్రధాని వివరించనున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ తెక్కింకాడు మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, సామాజిక సంస్కృతిక కార్యకర్తలతోపాటు వివిధ రంగాల మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ నేతలు చెప్పారు. కేరళలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మరికొంతమంది జాతీయ నేతలు కేరళలో పర్యటించి ప్రజలతో మమేకమవుతారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇటీవల తెలిపింది.
మోదీ త్రిసూర్ పర్యటన మైలురాయిగా నిలుస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ అన్నారు. రాష్ట్రంలో అధికార ఎల్‌డీఎఫ్, ప్రతిపక్ష యుడీఎఫ్ త్వరలో రాజకీయ పతనాన్ని చవిచూస్తాయని సురేంద్రన్ విమర్శించారు.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"