PM Modi: 71 వేల మందికి కేంద్ర కొలువులు
ABN , Publish Date - Dec 23 , 2024 | 03:34 AM
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సోమవారం కొలువల జాతర జరగనుంది. ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 71 వేల మంది యువకులకు నియామక పత్రాలను ఇవ్వనున్నారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 22: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సోమవారం కొలువల జాతర జరగనుంది. ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 71 వేల మంది యువకులకు నియామక పత్రాలను ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల ద్వారా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. కేంద్ర హోంశాఖ, పోస్టల్ శాఖ, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, ఆర్థిక సేవలు తదితర శాఖల్లో 71 వేల మందిని ఒకేసారి భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటనలో తెలిపింది.