రేపు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య పథకం ప్రారంభం
ABN , Publish Date - Oct 28 , 2024 | 04:20 AM
ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లందరికీ అమలు చేయనున్న ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీ పీఎంజేఏవై)ను ప్రధాని నరేంద్ర మోదీ...
న్యూఢిల్లీ, అక్టోబరు 27: ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లందరికీ అమలు చేయనున్న ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీ పీఎంజేఏవై)ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న ప్రారంభించనున్నట్లు సమాచారం. అలాగే తల్లీబిడ్డల టీకాల కార్యక్రమాన్ని నమోదు చేసే యూ-విన్ పోర్టల్‌ని కూడా ప్రధాని అదే రోజు ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా పేదలు, మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి, ఉన్నత.. ఇలా అన్ని వర్గాల్లో 70 ఏళ్లు నిండిన లేదా ఆపైన వయస్సు ఉన్న వారందరూ ఆయుష్మాన్ భారత్ కార్డు పొందడానికి అర్హులు.