Prem Singh Tamang: టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సీఎం అయ్యాడు!
ABN , Publish Date - Jun 02 , 2024 | 08:52 PM
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం కాంత్రికార్ మోర్చ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు 31 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. దీంతో ఈ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
సిక్కిం, జూన్ 02: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం కాంత్రికార్ మోర్చ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకు 31 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. దీంతో ఈ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 56 ఏళ్ల ప్రేమ్ సింగ్ తమాంగ్ మంచి ఆర్గనైజర్‌గానే కాదు, మంచి పరిపాలన దక్షుడిగా.. కాస్తా ఆవేశం కలిగిన రాజకీయ నేతగా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించారు. 1968, ఫిబ్రవరి 5వ తేదీన కలు సింగ్ తమాంగ్, ధ్యాన్ మయా తమాంగ్‌కు ప్రేమ్ సింగ్ తమాంగ్ జన్మించారు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు.
Also Read: Amethi: మళ్లీ గెలవనున్న స్మృతీ ఇరానీ
అనంతరం 1990లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఆయన పాఠశాలలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత మూడేళ్లకు ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ మరుసటి ఏడాది అంటే.. 1994లో సిక్కిం డెమెక్రటిక్ ఫ్రెంట్ (ఎస్డీఎప్) పార్టీ సహా వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఆయన ఉన్నారు. అలా పార్టీ స్థాపించిన 20 ఏళ్లలో 15 ఏళ్లు సిక్కిం మంత్రిగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీకి బై బై చెప్పేశారు. ఆ క్రమంలో 2013లో సిక్కిం కాంత్రికార్ మోర్చ పార్టీని ప్రేమ్ సింగ్ తమాంగ్ స్థాపించారు. అలా 2014లో సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ 10 సీట్లను గెలుచుకుంది.
Also Read: ఈసీని కలిసిన ఇండియా కూటమి నేతలు
మరోవైపు ప్రేమ్ సింగ్ తమాంగ్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో ఆయన ఏడాది పాటు జైలు శిక్ష సైతం అనుభవించారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేగా అయనపై అనర్హత వేటు సైతం పడింది. ఇక 2017లో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 2019 ఎన్నికల్లో తమాంగ్ పార్టీ ఓటమిపాలు కావడంతో.. ఎస్‌డీఎఫ్ పార్టీ 17 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ కొద్ది రోజులకే అంటే మే 27వ తేదీ సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమాంగ్ బాధ్యతలు చేపట్టారు.
Also Read: Arvind Kejriwal: తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న కేజ్రీవాల్
అనంతరం అయిదు నెలలకు జరిగిన ఉప ఎన్నికల్లో పక్‌లోక్ కమరంగ్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎమ్మెల్యేగా గెలుపొంది.. ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలతోపాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. కానీ ఆరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జూన్ 2వ తేదీన జరిగింది. ఇక మిగిలిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.
Also Read: జూలో సీఎం యోగి ఆకస్మిక తనిఖీలు
For Latest News and National News click here..