Share News

Eid-ul-Adha: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ముర్ము, మోదీ

ABN , Publish Date - Jun 17 , 2024 | 10:20 AM

బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సామరస్యం, ఐక్యతను పెంపొందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా ముర్ము, ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు తమ ఎక్స్ అకౌంట్లో బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.

Eid-ul-Adha: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ముర్ము, మోదీ

ఢిల్లీ: బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని సామరస్యం, ఐక్యతను పెంపొందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా ముర్ము, ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు తమ ఎక్స్ అకౌంట్లో బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.

"ముస్లిం సోదరులు, సోదరీమణులకు ఈద్-ఉజ్-అధా శుభాకాంక్షలు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ మనకు ఎంతో సందేశాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా అణగారిన వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తామని ప్రతినబూనుదాం"అని ఎక్స్ పోస్ట్‌లో ముర్ము పేర్కొన్నారు.


"బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక సందర్భం సమాజంలో సామరస్యం, ఐక్యత బంధాలను సుస్థిరం చేస్తుంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా" అని మోదీ అన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 10:20 AM