Home » Droupadi Murmu
రిక్రూట్మెంట్ ప్రక్రియ రద్దు చేయడంతో వేలాది మంది అర్హులైన టీచర్లు ఉపాధి కోల్పోయినట్టు శిక్షక్ శిక్షకా అధికార్ మంచ్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని, రాష్ట్రపతి జోక్యం కోరుతూ లేఖ రాయాల్సిందిగా తనకు విజ్ఞప్తి చేశారని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 'నీట్' మినహాయింపు బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ బిల్లును రాష్ట్రపతి తిరస్కరించడం, అఖిలపక్ష సమావేశం 9న జరగనుందని సీఎంఎం స్టాలిన్ ప్రకటించారు
షాలిమార్ భాగ్ నివాసం వద్ద తనను అభినందించేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలందరికీ రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను ఆమోదించినట్టు తెలిపారు.
సత్యేంద్ర జైన్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు తగినన్ని ఆధారాలను ఎన్ఫోర్సెంట్ డైరక్టరేట్ సేకరించినట్టు ఎంహెచ్ఏ తెలిపింది. దీంతో ఆయనపై లీగల్ చర్యలు తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్రపతిని తాము కోరామని పేర్కొంది.
మహాకుంభ్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సుమారు 8 గంటల సేపు జరుగుతుంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. తొలుత సంగమ స్నానం, అనంతరం అక్షయ్‌వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజ, దర్శనంలో పాల్గొంటారు.
సోనియాగాంధీ వ్యాఖ్యలు గిరిజన వ్యతిరేక భావజాలంతో కూడుకున్నాయని ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు పవిత్రత, నిబంధనల పరిరక్షణకు, ప్రజాస్వామ్య సంస్థలు సమర్ధవంతంగా పనిచేసేందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ను కోరారు.
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ కోర్టులో శనివారం ఫిర్యాదు దాఖలైంది. దేశ అత్యున్నత రాజ్యాంగ అధికారాన్ని అగౌరవపరిచినందుకు సోనియా గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ముజఫర్‌పూర్‌కు చెందిన న్యాయవాది సుధీర్ ఓజా ఫిర్యాదు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విషయంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖల పట్ల కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి కార్యాలయం గౌరవాన్ని నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కట్టుబడి ఉంటుందని ఖర్గే పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగో లేదని చెప్పేందుకు ఆమె వాడిన "పూర్ థింక్'' అనే పదాన్ని వక్రీకరించి బీజేపీ నేతలు, ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
ఢిల్లీలోని ద్వారకలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, ద్రౌపది ముర్ము ఒక గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, ఆమెను అవమానించడం దేశంలోని 10 కోట్ల మంది గిరిజనులను అవమానించడమేనని అన్నారు.