Share News

‘హయ్యర్‌ అఫిషియల్‌’ ఎవరు?

ABN , Publish Date - Nov 22 , 2024 | 06:59 AM

ఆంధ్రప్రదేశ్‌లో 2019 మే నుంచి 2024 జూన్‌ వరకు ఉన్నతస్థానంలో ఉన్న హయ్యర్‌ అఫిషియల్‌కు అదానీ ‘లంచం ప్రామిస్‌ చేశారు’ అని

‘హయ్యర్‌ అఫిషియల్‌’ ఎవరు?

ఆంధ్రప్రదేశ్‌లో 2019 మే నుంచి 2024 జూన్‌ వరకు ఉన్నతస్థానంలో ఉన్న హయ్యర్‌ అఫిషియల్‌కు అదానీ ‘లంచం ప్రామిస్‌ చేశారు’ అని అమెరికా దర్యాప్తు సంస్థలు తెలిపాయి. ఇది... పూర్తిగా జగన్‌ జమానా! దీంతో... ఆ ‘హయ్యర్‌ అఫిషియల్‌’ ఎవరనే చర్చ మొదలైంది. ఆ ఐదేళ్లలో ముగ్గురు సీనియర్‌ అధికారులు విద్యుత్‌ శాఖ బాధ్యతలు నిర్వహించారు. పూర్తిగా ఐదేళ్లు ఎవరూ లేరు. అయితే.. ‘అఫిషియల్‌’ అంటే అధికారంలో ఉన్నవారు అనే అర్థమని, ఐఏఎస్‌ అధికారులు కారని చెబుతున్నారు. ఆ ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది జగనే! డిస్కమ్‌ల నిర్ణయాలను సీఎం ఎలా ప్రభావితం చేశారో కూడా అమెరికా దర్యాప్తు సంస్థలు వివరించాయి. పైగా... నివేదికలో పలు మార్లు ‘చీఫ్‌ మినిస్టర్‌’ అని నేరుగానే ప్రస్తావించాయి. దీంతో... ఆ హయ్యర్‌ అఫిషియల్‌ మరెవరో కాదు, నాటి ముఖ్యమంత్రి జగనే అని ముక్తాయిస్తున్నారు.

Updated Date - Nov 22 , 2024 | 06:59 AM