Share News

Uttar Pradesh: టైలర్‌ షాపుల్లో ఆడవాళ్లకు కొలతలు మహిళలే తీసుకోవాలి

ABN , Publish Date - Nov 09 , 2024 | 05:53 AM

టైలర్‌ షాపుల్లో మహిళల దుస్తుల కొలతలు కేవలం మహిళలే తీసుకోవాలని, జిమ్‌లలో మహిళా ట్రైనర్లు మాత్రమే మహిళలకు శిక్షణ ఇవ్వాలని, సెలూన్లలో మహిళలు మాత్రమే మహిళలకు సేవలందించాలని యూపీ మహిళా కమిషన్‌ ప్రతిపాదించింది.

Uttar Pradesh: టైలర్‌ షాపుల్లో ఆడవాళ్లకు కొలతలు మహిళలే తీసుకోవాలి

  • ఉత్తరప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ప్రతిపాదన

లఖ్‌నవూ, నవంబరు 8: టైలర్‌ షాపుల్లో మహిళల దుస్తుల కొలతలు కేవలం మహిళలే తీసుకోవాలని, జిమ్‌లలో మహిళా ట్రైనర్లు మాత్రమే మహిళలకు శిక్షణ ఇవ్వాలని, సెలూన్లలో మహిళలు మాత్రమే మహిళలకు సేవలందించాలని యూపీ మహిళా కమిషన్‌ ప్రతిపాదించింది. టైలర్‌ షాపుల్లో, జిమ్‌లలో పురుషులు మహిళలను అసభ్యకరంగా తాకడాన్ని(బ్యాడ్‌ టచ్‌) నిరోధించేందుకు, మహిళల భద్రత కోసం ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలిపింది.


జిమ్‌లలో, సెలూన్లలో, టైలర్‌ షాపుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాలని, అవి ఎల్లవేళలా పని చేసేలా చూడాలని సూచించింది. అక్టోబరు 28న జరిగిన భేటీలో కమిషన్‌ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ‘‘మహిళల యోగా సెంటర్లు, జిమ్‌లలో మహిళలు మాత్రమే శిక్షణనివ్వాలి. ఆడవారికి వస్తువులు అమ్మే షాపుల్లో తప్పనిసరిగా మహిళలు పనిచేయాలి’’ అని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇవి అమలైతే మహిళలకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కమిషన్‌ అభిప్రాయపడింది.

Updated Date - Nov 09 , 2024 | 05:53 AM