Share News

Rahul Gandhi : పర్బాణీలో దళిత యువకుడి మృతి పోలీసులే హత్యే

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:16 AM

మహారాష్ట్రలోని పర్బాణీలో పోలీసుల అదుపులో ఉన్న సోమనాథ్‌ సూర్యవంశి అనే దళిత యువకుడి మృతి కస్టోడియల్‌ డెత్‌ అం టూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణ లు చేశారు.

Rahul Gandhi : పర్బాణీలో దళిత యువకుడి మృతి పోలీసులే హత్యే

పర్బాణీ, డిసెంబర్‌ 23: మహారాష్ట్రలోని పర్బాణీలో పోలీసుల అదుపులో ఉన్న సోమనాథ్‌ సూర్యవంశి అనే దళిత యువకుడి మృతి కస్టోడియల్‌ డెత్‌ అం టూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణ లు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నందుకే సూర్యవంశీ బలయ్యారని రాహుల్‌ అన్నారు. పోలీసులే చిత్రహింసలకు గురిచేసి అతడిని చంపేశారని, ఇది వంద శాతం వాస్తవమని చెప్పారు. సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రాజ్యాంగం నమూనాను ధ్వంసం చేయడంతో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో సూర్యవంశీ సహా మొత్తం 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న సూర్యవం శీ.. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు.

Updated Date - Dec 24 , 2024 | 06:16 AM