Share News

Rahul Gandhi: నేనేం తప్పు చేశాను.. ఆలయంలోకి అనుమతి నిరాకరణపై రాహుల్ మండిపాటు

ABN , Publish Date - Jan 22 , 2024 | 10:53 AM

భారత్ జోడో న్యాయ్ యాత్ర(Barath Jodo Nyay Yatra)లో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అసోంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన నాగావ్‌లోని బటద్రవ సత్ర ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లగా అక్కడి అధికారులు అడ్డుకున్నారు.

Rahul Gandhi: నేనేం తప్పు చేశాను.. ఆలయంలోకి అనుమతి నిరాకరణపై రాహుల్ మండిపాటు

డిస్పూర్: భారత్ జోడో న్యాయ్ యాత్ర(Barath Jodo Nyay Yatra)లో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అసోంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన నాగావ్‌లోని బటద్రవ సత్ర ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లగా అక్కడి అధికారులు అడ్డుకున్నారు. తనను ఎందుకు అడ్డుకున్నారని రాహుల్ ప్రశ్నించగా.. పర్యటనతో ఘర్షణలు జరగవచ్చని అధికారులు సమాధానం ఇచ్చారు. వారి తీరుపట్ల రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. "నేనేం తప్పు చేశాను. మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేమైనా నేరం చేశానా. మేం ఆ ప్రాంతంలో ఎలాంటి ఘర్షణలు సృష్టించాలనుకోవట్లేదు. కేవలం ఆలయంలో పూజలు చేసి రావాలనుకుంటున్నాం" అని రాహుల్ అన్నారు. ఆలయాన్ని ఎవరు సందర్శించాలనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తారని ఎద్దేవా చేశారు.


రాహుల్‌కి ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడంపై శ్రీ గాంధీ నాగోన్‌లో కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు. దీనిపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ మాట్లాడుతూ.. "ఓ వైపు అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుండగా.. రాహుల్ గాంధీ అసోంలోని బటద్రవ సత్ర ఆలయాన్ని సందర్శిస్తే రెండు ఆలయాల మధ్య పోటీగా ప్రజలు భావిస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు" అని అన్నారు. కాగా ఆదివారం రాహుల్ రోడ్ షో జరుగుతుండగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ వారితో మాట్లాడాలని ప్రయత్నించగా భద్రతా దళాలు ఆయన్ని వారించాయి. దీంతో బస్సులోనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Jan 22 , 2024 | 10:58 AM