Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్ చివరికి..
ABN , Publish Date - Nov 04 , 2024 | 09:42 PM
రైలు ప్రయాణికులకు చిన్న శుభవార్త వచ్చింది. ప్యాసింజర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సూపర్ యాప్‌ను డిసెంబర్ 2024 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేస్ యోచిస్తోంది. ప్రస్తుత ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫారమ్‌కు ఈ యాప్ భిన్నంగా ఉండనుంది.
రైలు ప్రయాణికులకు చిన్న శుభవార్త వచ్చింది. ప్యాసింజర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సూపర్ యాప్‌ను డిసెంబర్ 2024 చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేస్ యోచిస్తోంది. ప్రస్తుత ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫారమ్‌కు ఈ యాప్ భిన్నంగా ఉండనుంది. యూజర్ల వినియోగం మరింత సౌకర్యవంతంగా ఉండడంతో పాటు సమర్థవంతంగా సేవలను అందించనుంది. ఈ సూపర్ యాప్‌పై ప్యాసింజర్లు బహుళ సేవలను సులువుగా పొందవచ్చు. ఈ యాప్ దేశవ్యాప్తంగా లక్షలాదికి ఎంతో ప్రయోజకరంగా ఉండనుంది.
సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) ఈ యాప్‌ను డెవలప్ చేస్తోంది. రైల్వేతో ముడిపడిన వివిధ రకాల సేవలన్నీ ఈ యాప్‌పై పొందవచ్చు. ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను కూడా బుకింగ్ చేసుకోవచ్చు. ట్రైన్ స్టేటస్‌ని కూడా చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్లాట్‌ఫామ్ పాస్‌ల కొనుగోలు, ట్రైన్స్ షెడ్యూల్స్‌ను చెక్ చేసుకోవడం, ట్రైన్ స్టేటస్ చెకింగ్‌తో పాటు ఇతర సేవలు కూడా ఈ యాప్‌పైనే పొందవచ్చు.
ఈ యాప్ అందుబాటులోకి వస్తే ప్రయాణీకులు వివిధ సేవల కోసం వివిధ యాప్‌లకు మారాల్సిన అవసరం ఉండదు. ఒకేచోట అన్ని రకాల సేవలు పొందవచ్చు. సీట్ల లభ్యత చెక్ చేసుకోవడం నుంచి రాయితీల కోసం దరఖాస్తు వరకు అన్ని సేవలు పొందే వీలుటుంది. కొత్త యాప్‌తో రైల్వే ప్రయాణికులు నేరుగా సూపర్ యాప్ ద్వారా ప్లాట్‌ఫారమ్ పాస్‌లు పొందవచ్చు. దీంతో టిక్కెట్ కౌంటర్‌ల వద్ద ఎక్కువ సేపు క్యూ లైన్లలో నిలబడకుండానే సులభంగా సేవలు పొందవచ్చు. అంతేకాదు ఈ యాప్‌పై అనేక రకాల పార్ట్‌నర్ రెస్టారెంట్‌లు, విక్రేతల నుంచి భోజనాన్ని రజమా ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.