Indian Railway: అయోధ్యకు స్పెషల్ రైళ్లు.. ఎక్కడినుంచంటే
ABN , Publish Date - Jan 18 , 2024 | 06:15 PM
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగనుండగా.. ఆ రోజు తరువాత భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ 200 స్పెషల్ రైళ్లు నడపడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆస్తా పేరుతో ప్రత్యేక రైళ్లు ప్రారంభించనుంది. దేశంలోని 66 ప్రధాన ప్రాంతాల మీదుగా అయోధ్య వరకు ఇవి నడవనున్నాయి.
ఢిల్లీ: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగనుండగా.. ఆ రోజు తరువాత భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ 200 స్పెషల్ రైళ్లు నడపడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆస్తా పేరుతో ప్రత్యేక రైళ్లు ప్రారంభించనుంది.
దేశంలోని 66 ప్రధాన ప్రాంతాల మీదుగా అయోధ్య వరకు ఇవి నడవనున్నాయి. ఢిల్లీ, అగర్తలా, టిన్సుకియా, బార్మర్, కత్రా, జమ్మూ, నాసిక్, డెహ్రాడూన్, భద్రక్, ఖుర్దా రోడ్, కొట్టాయం, సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట నుంచి ఆస్తా రైళ్లు ప్రారంభమవుతాయి. డిమాండ్‌ను బట్టి రైళ్ల సంఖ్యను పెంచనున్నారు. భక్తులకు ప్రత్యేక వసతులు కల్పించేందుకు ఒక్కో రైలులో 22 కోచ్‌లు ఉంటాయి.
ఆస్తా ట్రైన్ టిక్కెట్‌లను IRCTC వెబ్‌సైట్, యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. తమిళనాడులో చెన్నై, సేలం, మధురై సహా 9 స్టేషన్ల నుంచి ఇవి ప్రారంభమవుతాయి.
మార్గాలివే(అప్ అండ్ డౌన్)
ఢిల్లీ
ఢిల్లీ స్టేషన్ - అయోధ్య
ఆనంద్ విహార్ - అయోధ్య
నిజాముద్దీన్ - అయోధ్య
ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ - అయోధ్య ధామ్
మహారాష్ట్ర
ముంబయి - అయోధ్య
నాగ్‌పుర్ - అయోధ్య
పుణె - అయోధ్య
వార్ధా - అయోధ్య
జాల్నా - అయోధ్య
గోవా: ఆస్తా స్పెషల్ ట్రైన్(1)
తెలంగాణ
సికింద్రాబాద్ - అయోధ్య
కాజీపేట - అయోధ్య
తమిళనాడు
చెన్నై - అయోధ్య
కోయంబత్తూర్ - అయోధ్య
మధురై - అయోధ్య
సాలెం - అయోధ్య
జమ్మూ కశ్మీర్
జమ్మూ - అయోధ్య
కట్రా - అయోధ్య
గుజరాత్
ఉద్నా - అయోధ్య
ఇండోర్ - అయోధ్య
మెహ్సానా - సలార్‌పూర్ - మెహ్సానా
వాపీ - అయోధ్య
వడోదర - అయోధ్య
పలన్‌పుర్ - అయోధ్య
వల్సాద్ - అయోధ్య
సబర్మతి - సలార్‌పూర్ - సబర్మతి
మధ్యప్రదేశ్
ఇండోర్ - అయోధ్య
బినా - అయోధ్య
భోపాల్ - అయోధ్య
జబల్‌పుర్ - అయోధ్య