Ratan Tata: ప్రపంచ కుబేరుల జాబితాలో రతన్ టాటా ఎందుకు లేరంటే..?
ABN , Publish Date - Oct 10 , 2024 | 03:30 PM
వందల ఏళ్ల క్రితమే ముత్తాత వ్యాపారాన్ని స్థాపించారు. వాటిని ముత్తాతతోపాటు తాతలు, తండ్రులు విస్తరించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ టాటా గ్రూప్ సంస్థకు వందలాది పరిశ్రమలున్నాయి. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. ప్రపంచంలోని మొత్తం ఐదు ఖండాల్లో 100 దేశాల్లో ఈ సంస్థకు 30 కంపెనీలున్నాయి. దీంతో ఈ సంస్థల ఆస్తులు.. రూ. లక్షల కోట్లలో ఉంటాయి. దీంతో టాటాలు ఏం చేయనక్కర్లేదు.
ఓ మేగజైన్ నిర్వహించిన సర్వేలో.. ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో.. భారత్‌కు చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ, అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీలు ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి లేదా రెండో స్థానంలో నిలిచారంటూ వార్తలు ప్రతీ ఏడాది వింటూ ఉంటాం. చూస్తూ ఉంటాం. కానీ టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా పేరు మాత్రం ఆ జాబితాలో ఎక్కడ కనిపించదు. ఓ వేళ కనిపించినా.. అడుగున ఎక్కడో పాతాళంలో ఆయన పేరు ఉంటుంది.
Also Read: విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిన భారత్
వందల ఏళ్ల క్రితమే ముత్తాత వ్యాపారాన్ని స్థాపించారు. ముత్తాతతోపాటు తాతలు, తండ్రులు వాటిని విస్తరించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ టాటా గ్రూప్ సంస్థకు వందలాది పరిశ్రమలున్నాయి. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. ప్రపంచంలోని మొత్తం ఐదు ఖండాల్లో 100 దేశాల్లో ఈ సంస్థకు 30 కంపెనీలున్నాయి. దీంతో ఈ సంస్థల ఆస్తులు.. రూ. లక్షల కోట్లలో ఉంటాయి. దీంతో టాటాల వంశస్తులు ఏం చేయనక్కర్లేదు. జస్ట్ వాటిని పెంచుకుంటే.. సంస్థలను మరింత విస్తరించుకుంటే సరిపోతుంది.
వీటిని విస్తరించకున్నా.. భారత్‌లోనే కాదు.. ఆసియా ఖండంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితాలో సైతం రతన్ టాటా అగ్రస్థానంలో నిలుస్తారు. ఆ స్థానంలో ఆయన కొన్ని దశాబ్దాలు పాటు ఆ పరంపరను కొనసాగించే అవకాశం సైతం ఉంది. కానీ ఏనాడు ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిలవలేదు. కనీసం టాప్ టెన్‌లో లేకుంటే.. తొలి 20 స్థానాల్లో సైతం ఆయన పేరు ఎక్కడా కనిపించదు. ప్రస్తుతం రతన్ టాటా మరణంతో.. ఇదే అంశం దేశ ప్రజల్లో ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తుంది.
ప్రపంచ కుబేరు జాబితాలో రతన్ టాటా ఎందుకు చేరలేదంటే..?
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో టాటా సంస్థకు పదుల సంఖ్యలో కంపెనీలున్నాయి. వీటి ద్వారా సంస్థకు ఏటా భారీగా ఆదాయం వస్తుంది. కానీ రతన్ టాటా మాత్రం ఎందుకు ప్రపంచ కుబేరు జాబితాలో భూతద్దం వేసి వేతికినా కనిపించడం లేదంటే.. ఈ సంస్థకు వచ్చిన ఆదాయంలో 66 శాతం దాతృత్వానికి వినియోగిస్తున్నారు. అది కూడా టాటా ట్రస్ట్ ద్వారా మనవాళికి ఉపయోగపడే సేవలకు ఈ మొత్తాన్ని విరాళాలుగా అందజేస్తున్నారు.
దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 400కిపైన స్థానాల్లోనే గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తున్నారు. టాటా కంపెనీల వార్షిక ఆదాయం రూ. 150 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని ఓ అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీల్లో దాదాపు 10 లక్షల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. అయినా ఏనాడు టాటా గ్రూప్ సంస్థల అధిపతిగా రతన్ టాటా అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. అలాగే ఆయన సింపిల్‌గా ఉండేవారన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ సంస్థను చెందిన ఆస్తులన్నీ టాటా ట్రస్ట్‌కు రాసిన వితరణ శీలుర కుటుంబం రతన్ టాటాది.
For National News And Telugu News..