Share News

cylinder price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:44 AM

ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు తగ్గించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌కు రూ.69 చొప్పున తగ్గించాయి. కాగా ఇళ్లలో వినియోగించే 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్ల ధరను మాత్రం రూ.803 వద్దే

cylinder price: గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

ఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల(Commercial Gas Cylinder Prices) ధరలు తగ్గించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌కు రూ.69 చొప్పున తగ్గించాయి. కాగా ఇళ్లలో వినియోగించే 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్ల ధరను మాత్రం రూ.803 వద్దే ఉంచాయి.


విమాన ఇంధనం ధరను ఏకంగా 6.5 శాతం తగ్గించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

దీంతో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,676కు చేరుకుంది. వరుసగా మూడో నెల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించడం విశేషం. మే 1న రూ.19 తగ్గించగా... ఏప్రిల్‌ 1న రూ.30.5 తగ్గించాయి. కాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

19 కేజీల ఇండేన్ గ్యాస్ ధర(మెట్రో నగరాల్లో)

ఢిల్లీ రూ.1,676

కోల్‌కతా రూ.1,787

ముంబయి రూ.1,629

చెన్నై రూ.1,840

For Latest News and National News click here..

Updated Date - Jun 02 , 2024 | 11:07 AM