అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు ఊరట
ABN , Publish Date - Feb 21 , 2024 | 03:33 AM
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై విచారణ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లా కోర్టు
సుల్తాన్‌పూర్, ఫిబ్రవరి 20: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. దీనిపై విచారణ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లా కోర్టు మంగళవారం ఆయనకు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. 2018లో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ, ‘రాజకీయాల్లో ఎప్పుడూ స్వచ్ఛంగా, నిజాయతీగా ఉంటామని చెప్పుకునే బీజేపీ ఒక హత్య కేసులో నిందితుడిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. దీనిపై యూపీ బీజేపీ నేత విజయ్ మిశ్రా అదే ఏడాది ఆగస్టులో రాహుల్‌పై ప్రత్యేక ఎంపీ- ఎమ్మెల్యే కోర్టులో ఫిర్యాదు చేశారు. తాజాగా రాహుల్ కోర్టుకు హాజరవగా.. కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది.