Parade: గణతంత్ర దినోత్సవ పరేడ్‌కి వెళ్తున్నారా.. టిక్కెట్లు ఇలా ఈజీగా బుక్ చేసుకోండి
ABN , Publish Date - Jan 06 , 2024 | 10:50 AM
గణతంత్ర దినోత్సవం(Indian Republic Day 2024) అనగానే గుర్తొచ్చేది ఢిల్లీలో జరిగే కవాతు. భారత్ త్వరలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న సందర్భంగా దేశ రాజధాని ముస్తాబవుతోంది. జనవరి 26న ఉదయం 9:30 గంటలకు విజయ్ చౌక్ నుండి కవాతు ప్రారంభమై ఐదు కిలోమీటర్లకు పైగా సాగి, నేషనల్ స్టేడియం వద్ద ముగుస్తుంది.
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం(Indian Republic Day 2024) అనగానే గుర్తొచ్చేది ఢిల్లీలో జరిగే కవాతు. భారత్ త్వరలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న సందర్భంగా దేశ రాజధాని ముస్తాబవుతోంది. జనవరి 26న ఉదయం 9:30 గంటలకు విజయ్ చౌక్ నుండి కవాతు ప్రారంభమై ఐదు కిలోమీటర్లకు పైగా సాగి, నేషనల్ స్టేడియం వద్ద ముగుస్తుంది. ఈ కార్యక్రమం దేశ సైనిక బలాన్ని ప్రదర్శించడమే కాకుండా భారత సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.
కవాతు సందర్భంగా సైనికులు చక్కటి యూనిఫాం ధరిస్తారు. ఈ సందర్భంగా సాయుధ వాహనాలు, యుద్ధ విమానాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఇవేకాకుండా నృత్య ప్రదర్శనలు, జానపద పాటలు, భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని తెలిపేలా ప్రదర్శనలు సాగుతాయి. వేడుకను చూసేందుకు దేశ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి జెండాలు చేతబూని తమ దేశభక్తిని చాటుకుంటారు. చాలా మంది ఈ అద్భుతమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈవెంట్ కి హాజరయ్యేవారు టిక్కెట్ ఎలా బుక్ చేయాలనే సందిగ్ధంలో ఉంటారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో టిక్కెట్ బుకింగ్ వివరాలు పరిశీలిద్దాం.
తేదీ: జనవరి 26
వేదిక: రాజ్‌పథ్, ఢిల్లీ
సమయం: ఉదయం 10:00 (ప్రారంభ సమయం: 9:30)
రిపబ్లిక్ డే పరేడ్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయాలి?
స్టెప్ 1: ఇన్విటేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IMS) లేదా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆమంత్రన్ ఆన్‌లైన్ పోర్టల్ (aamantran.mod.gov.in/login)లోకి వెళ్లండి.
స్టెప్ 2: మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఆపై దానికి పంపిన OTPని అందించండి.
స్టెప్ 3: మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, క్యాప్చా కోడ్ వంటి ఇతర వివరాలను నింపి నమోదు చేయండి.
స్టెప్ 4: "రిపబ్లిక్ డే పరేడ్" జాబితాలోని ID రకాన్ని ఎంచుకుని, చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువును అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 5: టికెట్ కోసం ఆన్‌లైన్ చెల్లింపు చేయడానికి కొనసాగండి.
స్టెప్ 6: పేమెంట్ సక్సెస్ అయ్యాక టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆఫ్‌లైన్‌లో కొనుగోలు ఇలా..
ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ITDC) ట్రావెల్ కౌంటర్లు, ఢిల్లీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (DTDC) కౌంటర్లు, ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో డిపార్ట్‌మెంటల్ సేల్ కౌంటర్‌ల సహాయంతో టిక్కెట్‌లను ఆఫ్ లైన్‌లో పొందవచ్చు. ఇవే కాకుండా పార్లమెంటు హౌస్ రిసెప్షన్ కార్యాలయం, జనపథ్‌లోని భారత ప్రభుత్వ పర్యాటక కార్యాలయం కూడా నిర్దిష్ట గంటలలో టిక్కెట్లు అందుబాటులో ఉంచుతాయి.
సేన భవన్, శాస్త్రి భవన్, జంతర్ మంతర్, ప్రగతి మైదాన్, పార్లమెంట్ హౌస్‌లోని బూత్‌లు, కౌంటర్ల నుండి కూడా టిక్కెట్‌లను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో టిక్కెట్‌లను కొనుగోలు చేసేటప్పుడు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ వంటి ఒరిజినల్ ఫోటో ID కార్డ్‌ను చూపించాల్సి ఉంటుంది.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"