Home » Republic day
చాలాకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న జనగణన ప్రక్రియను కేంద్రం వచ్చే ఏడాది మొదట్లోనే చేపట్టి.. 2026కల్లా జాతీయ జనాభా పట్టికను నవీకరించి, ఆ వివరాలను ప్రజలకు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Republic Day 2024 parade dazzled by cultural extravaganza celebrating 'women power' with pride Naik
తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్లో జెండావిష్కరణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు.
దేశ రాజధాని దిల్లీలో చేపట్టిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. అతిరథ మహారథుల మధ్య వివిధ రంగాలు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సారి నారీశక్తి పేరుతో త్రివిధ దళాలు చేపట్టిన కవాతు చూపుతిప్పుకోకుండా చేశాయి. వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాలు.. ఆయా రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలుగా నిలిచాయి. వాయు విన్యాసాలు తల ఎత్తుకునేలా చేశాయి. చివరగా ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలందరికీ అభివాదం చేసి వేడుకలకు ముగింపు పలికారు.
రష్యా రాయబార కార్యాలయం భారతదేశానికి డిఫరెంట్‌గా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసింది. బాలీవుడ్ ఫేమస్ పాటకు చిన్నారుల డ్యాన్స్ చేసే వీడియోను సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు విధ్వంసానికి గురయ్యాయి. ప్రజా ప్రభుత్వంలో వాటిని నిర్మించుకుంటున్నాం అని స్పష్టం చేశారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో మోగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జాతీయ జెండాను ఎగురవేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై భారతీయ జనతా పార్టీ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్నట్టే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
విజయవాడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలు కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాయి.