పని చేయకుంటే పదవీ విరమణే
ABN , Publish Date - Jun 29 , 2024 | 05:39 AM
సక్రమంగా పనిచేయకుంటే ముందుగానే పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను హెచ్చరించింది. ఈ విషయమై 2020లోనే ఉత్తర్వులు ఇచ్చినా వాటిని
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ, జూన్ 28: సక్రమంగా పనిచేయకుంటే ముందుగానే పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను హెచ్చరించింది. ఈ విషయమై 2020లోనే ఉత్తర్వులు ఇచ్చినా వాటిని సక్రమంగా అమలు చేయడం లేదని ఆక్షేపణ తెలిపింది. ఆ ఉత్తర్వులను విధిగా పాటించాలని సిబ్బంది, శిక్షణ శాఖ శుక్రవారం మరోసారి ఆదేశాలు ఇచ్చింది. సక్రమంగా విధులు నిర్వర్తించకున్నా, విశ్వసనీయత లోపించినా, సమర్థతలేకున్నా గడువుకు ముందుగానే పదవీ విరమణ చేయించాలని తెలిపింది. అలాంటి వారిని తక్షణమే గుర్తించాలని సూచించింది. ఉద్యోగుల పనితీరుపై ప్రతి నెలా 15వ తేదీన నిర్ణీత ఫారంలో నివేదికలు పంపిస్తుండాలని ఆదేశించింది.