Share News

Ganpati Puja celebrations: సీజేఐ ఇంట ప్రధాని మోదీ.. రేగిన వివాదం

ABN , Publish Date - Sep 12 , 2024 | 02:30 PM

న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దీనిపై మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.

Ganpati Puja celebrations: సీజేఐ ఇంట ప్రధాని మోదీ.. రేగిన వివాదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దీనిపై మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. సీజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడంతో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమయ్యే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Jammu Kashmir Assembly Elections: అలా కాకుంటే గవర్నర్ పదవికి రాజీనామా చేస్తా..!


రాజకీయ నాయకుడితో రాజ్యాంగ సంరక్షకుడు సమావేశం కావడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలతో సీజేఐ నివాసానికి ప్రదాని మోదీ వెళ్లడం వివాదాస్పదంగా మారింది. శివసేన ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. గణపతి పూజా వేడుకల్లో మాత్రమే ప్రధాని మోదీ పాల్గొన్నారని స్పష్టం చేసింది. ఇది మన సంస్కృతిలో భాగమని ఈ సందర్బంగా వివరించింది.

Also Read: Viral Video: లంగా గాడు.. ఈ నా కొడుకు ఆ స్థాయి ఉందా


ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని నిజమైన శివసేన పార్టీగా గుర్తిస్తూ మహారాష్ట్ర స్పీకర్ నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్దవ్ ఠాక్రే శిబిరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు వచ్చే సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి తప్పుకోవాలని సీజేఐకి ఎంపి ఏకనాథ్ షిండే సూచించారు.

Also Read: karnataka: మాండ్యలో మత ఘర్షణలు: 52 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


అంతేకాదు.. ప్రతిపక్షాలను వ్యతిరేకంగా ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తన ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. అందులో కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం, మద్యం కుంభకోణం మనీల్యాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంశాలను సైతం పొందు పరిచారు. ఈ కేసులన్నీ వరుస క్రమంలో ఓ పద్దతి ప్రకారం అర్థం చేసుకుంటే అన్ని అర్థమవుతాయన్నారు. ఇదే అంశంపై శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది, మిలింద్ దేవరలు సైతం కాస్తా ఘాటుా స్పందించారు.

Also Read: RG Kar Medical College: ప్రొ. సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ సోదాలు


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నివాసంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం టోపీ ధరించి ప్రధాని మోదీ ఈ వేడుకలకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. ఈ వేడుకలకు విచ్చేసిన ప్రధాని మోదీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు సాదరంగా ఆహ్వానించారు.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 12 , 2024 | 05:00 PM