ప్రొఫెసర్ సాయిబాబా స్మృత్యర్థం ఏర్పాటైన ఫిల్మ్ ఫెస్టివెల్‌ను అడ్డుకున్న ఆర్‌ఎ్‌సఎస్
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:27 AM
ప్రొఫెసర్ సాయిబాబా, పాలస్తీనా చిన్నారుల స్మృత్యర్థం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ‘9వ ఉదయ్‌పూర్ ఫిల్మ్ ఫెస్టివెల్’ను ఆర్‌ఎ్‌సఎస్ అనుబంధ సంస్థలు అడ్డుకున్నాయి.
జైపూర్, నవంబరు 19: ప్రొఫెసర్ సాయిబాబా, పాలస్తీనా చిన్నారుల స్మృత్యర్థం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ‘9వ ఉదయ్‌పూర్ ఫిల్మ్ ఫెస్టివెల్’ను ఆర్‌ఎ్‌సఎస్ అనుబంధ సంస్థలు అడ్డుకున్నాయి. నగరంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో మూడు రోజుల చలన చిత్రోత్సవాన్ని జరపటానికి నిర్వాహకులు అన్ని అనుమతులు తీసుకొని శుక్రవారం ప్రారంభించారు. రెండోరోజైన శనివారం.. పలువురు సంఘ్ కార్యకర్తలు అక్కడికి వచ్చి.. సాయిబాబా మీద, పాలస్తీనా మీద చిత్రాలు ప్రదర్శించటం దేశ వ్యతిరేకమని, దేశ ప్రజల్ని క్షమాపణ కోరుతూ వీడియో విడుదలు చేయాలంటూ వీరంగం వేశారు. ఫిల్మ్ ఫెస్టివెల్‌ను బలవంతంగా అడ్డుకున్నారు. దీంతో చలనచిత్రోత్సవాన్ని నగరంలోనే మరో చోట ఏర్పాటు చేసిన ఓ తాత్కాలిక గుడారంలోకి మార్చుకొని కార్యక్రమాన్ని కొనసాగించారు.