Share News

కాగ్‌ అధిపతిగా సంజయ్‌ మూర్తి ప్రమాణం

ABN , Publish Date - Nov 22 , 2024 | 06:45 AM

భారత కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) అధిపతిగా తెలుగు అధికారి కొండ్రు సంజయ్‌ మూర్తి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గణతంత్ర మండపంలో గురువారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది

కాగ్‌ అధిపతిగా సంజయ్‌ మూర్తి ప్రమాణం

ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు అధికారిగా అరుదైన ఘనత

న్యూఢిల్లీ, నవంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): భారత కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) అధిపతిగా తెలుగు అధికారి కొండ్రు సంజయ్‌ మూర్తి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గణతంత్ర మండపంలో గురువారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సంబంధిత పత్రాలపై సంతకం చేసి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన ఘనత సాధించారు. సంజయ్‌ మూర్తి 1964 డిసెంబరు 24న జన్మించారు. మెకానికల్‌ విభాగంలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. 1989లో ఐఏఎస్‌ అధికారిగా హిమాచల్‌ప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికయ్యారు. ఆ తర్వాత కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు సహా వివిధ కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 2021 సెప్టెంబరు నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో సంజయ్‌ మూర్తి కీలక పాత్ర పోషించారు. ఆయన తండ్రి కేఎ్‌సఆర్‌ మూర్తి కూడా ఐఏఎస్‌ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆతర్వాత 1991 నుంచి 1996 వరకు కాంగ్రెస్‌ తరఫున అమలాపురం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు

Updated Date - Nov 22 , 2024 | 06:45 AM