Share News

sarabjit singh: సరబ్‌జిత్ హంతకుడు దారుణ హత్య

ABN , Publish Date - Apr 14 , 2024 | 07:59 PM

పాకిస్థాన్ జైల్లో భారతీయుడు సరబ్‌జిత్ సింగ్‌ని హత్య చేసిన అమిర్ సర్ఫరజ్ తంబా ఆదివారం దారుణ హత్యకు గురైయ్యాడు. లాహోర్‌లోని ఇస్లాంపురం ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఆగంతకుడు.. తంబాను తుపాకీతో కాల్చారు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రి తరలించారు.

sarabjit singh: సరబ్‌జిత్ హంతకుడు దారుణ హత్య
Sarabjit Singh

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: పాకిస్థాన్ జైల్లో భారతీయుడు సరబ్‌జిత్ సింగ్‌ ( Sarabjit Singh )ని హత్య చేసిన అమిర్ సర్ఫరజ్ తంబా ( Amir Sarfaraz Tamba) ఆదివారం దారుణ హత్యకు గురైయ్యాడు. లాహోర్‌లోని ఇస్లాంపురం ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఆగంతకుడు.. తంబాను తుపాకీతో కాల్చారు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రి తరలించారు. అయితే అతడు ఆసుపత్రికి చేరుకునే లోపే మరణించారని వైద్యులు ప్రకటించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. లష్కర్ ఈ తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌కు ముఖ్య అనుచరుడిగా తంబా ఉండేవాడు.

Iran-Israel war: ఇజ్రాయెల్‌లోని భారతీయుల కోసం..

ఇక సరబ్‌జిత్ సింగ్ స్వస్థలం.. పంజాబ్ రాష్ట్రంలో భారత్, పాక్ సరిహద్దుల్లోని ఓ కుగ్రామం. అయితే అతడు మద్యం సేవించి పాక్ సరిహద్దు దాటి.. ఆ దేశ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో అతడిని పాక్ సైనికులు చుట్టుముట్టి బందించాయి. ఈ ఘటన 1991లో జరిగింది. దాంతో సరబ్‌జిత్‌పై గూఢచర్యం నేరం మోపి పాక్ జైల్లో నిర్భందించారు. ఆ క్రమంలో అతడికి పాక్ న్యాయ స్థానం మరణ శిక్ష విధించింది.


నాటి నుంచి జైల్లో మగ్గుతున్నాడు. అయితే అతడిని విడుదల చేయించేందుకు అతడి సోదరి దల్బీర్ కౌర్ భారత్ ప్రభుత్వం ద్వారా పాక్ ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తీసుకు వచ్చారు. కానీ ఆ ఒత్తిడి ఫలించలేదు. సరబ్‌జిత్ జైలు నుంచి విడుదల కాకుండానే మరణించారు.

లాహోర్‌లోని కోట్ లక్‌పతి జైల్లో సరబ్‌జిత్‌పై సహచర ఖైదీలు ఇటుక రాళ్లు, ఐరన్ రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడి చేసిన ఖైదీల్లో తంబా ముఖ్యుడు. ఈ ఘటనతో సరబ్‌జిత్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి పోయాడు. అతడిని లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. 2013, మే 2వ తేదీన మరణించారు.

జాతీయ వార్తలు కోసం...

Updated Date - Apr 14 , 2024 | 08:08 PM