Share News

Supreme Court: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ హోదాపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

ABN , Publish Date - Nov 08 , 2024 | 11:40 AM

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ విద్యాసంస్థా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్ట్ కీలకమైన తీర్పు ఇచ్చింది.

Supreme Court: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ హోదాపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు
Supreme court

న్యూఢిల్లీ: అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (AMU) మైనారిటీ విద్యాసంస్థా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్ట్ ఇవాళ (శుక్రవారం) కీలకమైన తీర్పు వెలువరించింది. ఏఎంయూకు మైనారిటీ హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు విభిన్నమైన తీర్పులు ఇచ్చారు. ఏఎంయూకి మైనారిటీ హోదాను తొలగిస్తూ 1967లో ఇచ్చిన తీర్పును న్యాయస్థానం రద్దు చేసింది. ఈ మేరకు రాజ్యాంగ ధర్మాసనం 4:3 అనుకూల తీర్పు ఇచ్చింది. అయితే మైనారిటీ హోదా కల్పించే అంశంపై తుది నిర్ణయాన్ని మరో బెంచ్‌కు అప్పగిస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ అంశంపై విచారణకు మరో బెంచ్ ఏర్పాటు కానుంది.

అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా ఇవ్వొద్దని తీర్పు ఇచ్చిన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జిస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్సీ శర్మ... కాగా చీఫ్ డీవై చంద్రచూడ్‌తో పాటు జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రా ఉన్నారు.


చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తీర్పును చదివారు. ధర్మాసనంలో నాలుగు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని వెల్లడించారు. మెజారిటీ తీర్పును తానే స్వయంగా రాశానన్నారు. జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్ మిశ్రా, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ దీపాంకర్ దత్తా, జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మ వేర్వేరుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

కాగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీని 1920లో స్థాపించారు. భారత రాజ్యాంగం ప్రకారం మైనారిటీ సంస్థగా గుర్తించవచ్చా లేదా అనే అంశం దీర్ఘకాలంగా వివాదాస్పద చర్చ నడుస్తోంది.


ఇవి కూడా చదవండి

MS Dhoni: ఎంఎస్ ధోనీ అంటే ఇదీ.. ఆశ్చర్యపోయిన బెంగళూరు దంపతులు..

అమెరికా చరిత్రలో తొలిసారి.. కీలక పదవికి మహిళ పేరు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్

కివీస్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియాకు కీలక సలహా ఇచ్చిన కపిల్ దేవ్

అమెరికా ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారి స్పందన.. ట్రంప్‌కు ఓ సలహా

గర్ల్‌ఫ్రెండ్ కొత్త హెయిర్‌ స్టెయిల్ నచ్చలేదని.. నమ్మలేని పని చేశాడు

For More TS News and Telugu News

Updated Date - Nov 08 , 2024 | 12:08 PM