ఎన్నికల్లో పోటీకి ఆర్థిక సాయం చేయరూ ప్రజలకు సిసోడియా విజ్ఞప్తి
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:23 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆప్ సీనియర్ నేత సిసోడియా ప్రజలకు వినూత్న విజ్ఞప్తి చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన కోరారు.
ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణ ప్రారంభించిన ఆప్ నేత సిసోడియా
న్యూఢిల్లీ, డిసెంబరు 30: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆప్ సీనియర్ నేత సిసోడియా ప్రజలకు వినూత్న విజ్ఞప్తి చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సహాయం చేయాలని ఆయన కోరారు. ఆర్థిక సహాయం అందించేందుకుగాను ఒక ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం పట్పర్‌గంజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిసోడియా.. ఈసారి జంగ్‌పుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల కోసం ప్రజల నుంచి ఆర్థిక సహాయం కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. మీడియా సమావేశంలో సిసోడియా మాట్లాడుతూ.. ‘‘మీరు విరాళంగా ఇచ్చే ప్రతి రూపాయి ఢిల్లీలో విద్య తదితరాల పురోగతికి దోహదపడుతుంది’’ అని పేర్కొన్నారు. కాగా, సిసోడియాకు విరాళాలు కోరుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.