Building collapse: గుజరాత్‌లో మరో ఉపద్రవం, కుప్పకూలిన ఆరంతస్తుల భవనం
ABN , Publish Date - Jul 06 , 2024 | 07:18 PM
గుజరాత్ లో మరో ఉపద్రవం చోటుచేసుకుంది. సూరత్‌లోని సచిన్ పాలీ గ్రామంలో ఆరంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. సుమారు 15 మంది వరకూ ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
సూరత్: గుజరాత్ (Gujarat)లో మరో ఉపద్రవం చోటుచేసుకుంది. సూరత్‌లోని సచిన్ పాలీ గ్రామంలో ఆరంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. సుమారు 15 మంది వరకూ ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి ఇతమిత్థమైన కారణం తెలియనప్పటికీ ఇటీవల కురిసిన వర్షాల కారణంగానే శిథిలావస్థలో ఉన్న ఈ భవంతి కూలిపోయినట్టు అంచనా వేస్తున్నారు.
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: సైనికుడు మృతి
కాగా, 2017-18లో ఈ ఆరంతస్తుల భవనాన్ని నిర్మించారని, కట్టిన ఆరేళ్లలోనే శిథిలావస్థకు చేరుకుందని తెలుస్తోంది. భవంతిని ఖాళీ చేయాల్సిందిగా యజమానిని ఇప్పటికే సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించిందని, చాలా కుటుంబాలు ఇంతకుముందు ఈ భవంతిని ఖాళీ చేసి వెళ్లిపోయాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఐదారు కుటుంబాలు మాత్రమే ఈ భవంతిలో ఉండగా, యజమాని మాత్రం విదేశాల్లో ఉంటున్నారు.
For Latest News and National News click here