Social Media : ‘ఎక్స్’ ప్రీమియం ప్లస్ ధరలు 35% మేర పెంపు!
ABN , Publish Date - Dec 24 , 2024 | 06:39 AM
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ తన ప్రీమియం ప్లస్ ధరలను భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెంచినట్లు ప్రకటించింది. దేశంలో 35 శాతం మేర ఈ ధరలు పెరగ్గా.. అమెరికాలో 38
న్యూఢిల్లీ, డిసెంబరు 23: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ తన ప్రీమియం ప్లస్ ధరలను భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెంచినట్లు ప్రకటించింది. దేశంలో 35 శాతం మేర ఈ ధరలు పెరగ్గా.. అమెరికాలో 38 శాతం పెరిగాయి. ఈనెల 21 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఎక్స్ పేర్కొంది. దేశంలో ప్రీమియం ప్లస్ ధరను నెలకు రూ.1,300 నుంచి రూ.1,750, ఏడాదికి రూ.13,600 నుంచి రూ.18,300కు పెంచినట్లు వెల్లడించింది. ఎక్స్ అందించే వివిధ ప్రీమియం సేవల్లో అత్యుత్తమ సేవలను ప్రీమియం ప్లస్ ద్వారా పొందవచ్చు. ప్రకటనలు లేకుండా కంటెంట్‌ను వీక్షించవచ్చు. అలాగే కంటెంట్ క్రియేటర్లు ఎక్కువ ఆదాయం సంపాదించేందుకు వీలుంటుంది. గ్రోక్ ఏఐ మోడల్ యాక్సెస్, కీవర్డ్స్‌పై సూచనలకు రాడార్ వంటి ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి రానుంది.