రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ప్రమాణం
ABN , Publish Date - Apr 05 , 2024 | 03:31 AM
తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి,
ఏపీ నుంచి వైవీ, గొల్ల, మేడా.. తెలంగాణ నుంచి ఒకరు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన చాంబర్‌లో గురువారం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి తొలిసారిగా పెద్దల సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమెతోపాటు తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర(బీఆర్‌ఎస్), ఏపీ నుంచి వైసీపీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్‌రెడ్డి, ఒడిశా నుంచి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(బీజేపీ), సుభాశిశ్ కుంతియా(బీజేడీ), దేబాశిశ్ సామంతరాయ్(బీజేడీ), కర్ణాటక నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, యూపీ నుంచి ఆర్‌పీఎన్ సింగ్(బీజేపీ), పశ్చిమబెంగాల్ నుంచి సామిక్ భట్టాచార్య(బీజేపీ), బిహార్ నుంచి సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), మదన్ రాథోర్(బీజేపీ)లు ప్రమాణ స్వీకారం చేశారు.