Share News

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా

ABN , Publish Date - Feb 14 , 2024 | 04:03 AM

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని మంగళవారం పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె బుధవారం జైపూర్‌

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా

నేడు జైపూర్‌లో నామినేషన్‌ సమర్పణ

రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ బరిలో ప్రియాంక!

న్యూఢిల్లీ, జైపూర్‌, ఫిబ్రవరి 13: కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని మంగళవారం పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె బుధవారం జైపూర్‌ వెళ్లి నామినేషన్‌ పత్రాలు సమర్పించనున్నారని సమాచారం. ఆమె వెంట కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా వెళ్లనున్నారు. నామినేషన్‌ పత్రాల సమర్పణకు గురువారం చివరి రోజు కాగా, 27న ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం సోనియా తొలిసారిగా ఎగువ సభలో అడుగుపెట్టనున్నారు. ఆమె ఖాళీ చేసిన రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - Feb 14 , 2024 | 04:03 AM