12th fail: సుప్రీంకోర్టులో 12th ఫెయిల్ ప్రదర్శన.. మూవీపై చీఫ్ జస్టిస్ ప్రశంసలు!
ABN , Publish Date - Sep 27 , 2024 | 06:53 PM
12th ఫెయిల్.. యావత్ భారత దేశాన్ని కదిలించిన మూవీ ఇది. తాజాగా ఈ మూవీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కూడా ప్రశంసలు కురిపించారు.
ఇంటర్నెట్ డెస్క్: 12th ఫెయిల్.. యావత్ భారత దేశాన్ని కదిలించిన మూవీ ఇది. పేదరికంలో పుట్టి అనేక కష్టనష్టాలకు ఎదురీది ఐపీఎస్ అయిన ఓ అధికారి నిజజీవితం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం దేశంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. తాజాగా ఈ మూవీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కూడా ప్రశంసలు కురిపించారు. ఇలాంటి చిత్రాలు అందరిలో స్ఫూర్తిని నింపుతాయని అన్నారు (Chief Justice Chandrachud Singh).
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కోసం చిత్ర బృందం సుప్రీం కోర్టులో మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. చీఫ్ జస్టిస్‌తో పాటు న్యాయవాదులు, దాదాపు 600 మంది సుప్రీం కోర్టు అధికారులు, వారి కుటుంబసభ్యులు ఈ మూవీని వీక్షించారు. అనంతరం, ఈ మూవీ దర్శకుడు విధువినోద్ చోప్రా, నటీనటులు విక్రాంత్ మాసే, మేధా శంకర్‌లతో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ముచ్చటించారు.
MCD Polls: 115 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుపు, ఆప్ అభ్యర్థికి ఓట్లు నిల్
‘‘సుప్రీం కోర్టు స్టాఫ్ అందరిలో ఈ మూవీ స్ఫూర్తి రగిలించింది. తమ కొడుకులు, కూతుళ్లు, స్నేహితులు, బంధువులకు ఈ సినిమా చూడాలని వారు కచ్చితంగా చెబుతారు. చూట్టూ ఉన్న ప్రజల కోసం ఏదోకటి చేయాలనే తపనను ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరిలో రగిలిస్తాయి. విక్రాంత్, మేధా ఇద్దరు అద్భుతంగా నటించారు. కథలోని ప్రాతల్లో జీవించారు. నాటి పరిస్థితులను, ఆ కష్టాలను కళ్లకుకట్టినట్టు చూపించారు. సినిమా చూస్తుంటే నాకూ ఒకసారి కళ్లు చమర్చాయి. జీవితంలో ఆశాభావానికి ఉన్న గొప్పదనాన్ని ఈ మూవీ సందేశంగా ఇచ్చింది’’ అని ఆయన అన్నారు. తమ కోసం సమయం కేటాయించినందుకు సినీ బృందానికి ప్రధాన న్యాయమూర్తి ధన్యవాదాలు తెలిపారు.
MK Stalin Meets Modi: మోదీతో ఎంకే స్టాలిన్ 45 నిమిషాలు భేటీ
చీఫ్ జస్టిస్ కోసం ఈ సినిమా ప్రత్యేకంగా ప్రదర్శించే అవకాశం రావడం తనకు దక్కిన గౌరవమని మూవీ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా అన్నారు. చీఫ్ జస్టిస్ పక్కన కూర్చుని సినిమా చూసే అవకాశం రావడం గొప్ప అనుభూతని అన్నారు. సినిమా రూపొందించేందుకు ఐదేళ్లు కష్టపడ్డానని చెప్పారు. తమ కోసం సమయం కేటాయించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు.
Haryana Assembly Elections: ఎన్నికల వేళ 13 మంది నేతలపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు
ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా 12th ఫెయిల్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ మూవీని విధువినోద్ చోప్రా తన స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. మనోజ్ పాత్రలో విక్రాంత్ మాసే నటించగా, ఆయన భార్య పాత్రలో మేధ నటించారు. గతేడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల, విమర్శకుల మన్ననలు పొందింది. ముఖ్యంగా సినిమా స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, హీరోహీరోయిన్ల నటన అనేక మందిని మెప్పించింది.
Muda Scam: సీబీఐపై నిషేధం.. ఈడీ ఎంటర్ అవుతుందా..