Share News

కర్ణాటకలో సీబీఐకి నో ఎంట్రీ!

ABN , Publish Date - Sep 27 , 2024 | 04:34 AM

కర్ణాటకలో కేసుల విచారణకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీబీఐని అనుమతించరాదని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది. సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటకలో సీబీఐకి నో ఎంట్రీ!

బెంగళూరు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కేసుల విచారణకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీబీఐని అనుమతించరాదని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానించింది. సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, ఇకపై రాష్ట్ర కేసులకు సంబంధించి సీబీఐ నేరుగా దర్యాప్తు చేసే అవకాశం ఉన్న గెజిట్‌ను ఉపసంహరిస్తున్నామని తీర్మానం చేశారు. కేబినెట్‌ భేటీ వివరాలను రాష్ట్ర న్యాయ, శాసనసభ వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్‌ మీడియాకు వెల్లడించారు. ముడా ఇళ్ల స్థలాల వివాదం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోలేదని, తాము సీబీఐకి అప్పగించిన అన్ని కేసులకు వర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

Updated Date - Sep 27 , 2024 | 04:34 AM