Hijab protest: ఇరాన్‌లో హిజాబ్‌పై నిరసన.. బహిరంగంగా బట్టలు విప్పి తిరిగిన మహిళ.. వీడియో వైరల్..
ABN , Publish Date - Nov 03 , 2024 | 03:41 PM
ఇరాన్‌లోని మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. స్కార్ఫ్ వేసుకోవాలి. పూర్తిగా వదులుగా ఉండే దుస్తులు మాత్రమే వేసుకోవాలి. ఇరాన్ ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలపై 2022 నుంచే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ నుంచి విముక్తి కావాలంటే అక్కడి మహిళలు నిరసన చేస్తూనే ఉన్నారు.
ఇరాన్ (Iran)లో మహిళల వస్త్రధారణపై కొనసాగుతున్న ఆంక్షలు రోజురోజుకూ తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఇరాన్‌లోని మహిళలు తప్పనిసరిగా హిజాబ్ (Hijab) ధరించాలి. స్కార్ఫ్ వేసుకోవాలి. పూర్తిగా వదులుగా ఉండే దుస్తులు మాత్రమే వేసుకోవాలి. ఇరాన్ ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలపై 2022 నుంచే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ నుంచి విముక్తి కావాలంటే అక్కడి మహిళలు నిరసన చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ ఇరానియన్ యూనివర్సిటీలో షాకింగ్ పని చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Hijab protest).
టెహ్రాన్‌లోని ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె తన బట్టలను విప్పేసి కేవలం లో దుస్తులతోనే యూనివర్సిటీ ప్రాంగణంలో తిరిగింది. లో దుస్తులతో కాసేపు కూర్చుని, కాసేపు అటూ ఇటూ తిరిగింది. ఆ యువతిని అందరూ విచిత్రంగా చూశారు. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాసేపటి తర్వాత ఇరాన్ అధికారులు ఆ మహిళను అరెస్టు చేశారు. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని, ఆమెను హాస్పిటల్‌కు తరలించినట్టు యూనివర్సిటీ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.
సాంప్రదాయానికి వ్యతిరేకంగా అనుచిత దుస్తులు ధరించిందనే కారణంతో సెక్యూరిటీ గార్డులు ఆమెను హెచ్చరించారని, తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ తన దుస్తులు తీసి నిరసన తెలిపిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా వస్త్రధారణ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన పెరుగుతూనే ఉంది. 2022లో ఈ విషయమై భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆ సమయంలో 551 మంది నిరసనకారులు మరణించినట్టు వార్తలు వచ్చాయి.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..