కెనడాలో విద్యార్థుల పని గంటలు 24కి పెంపు
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:14 AM
తమ దేశంలో ఉండి చదువుకునే విదేశీ విదార్థుల పని గంటల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ, నవంబరు 19: తమ దేశంలో ఉండి చదువుకునే విదేశీ విదార్థుల పని గంటల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తోపాటు ఇతర విదేశీ విద్యార్థులకు క్యాంపస్ వెలుపల వారంలో 20 గంటలు పనిచేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే ఈ నెల 8వ తేదీ నుంచి దీన్ని 24 గంటలకు పెంచుతున్నట్టు కెనడా ప్రకటించింది. ఇది ఆ దేశంలో ఉండి చదువుకునే విద్యార్థులకు మేలు చేయనుంది. వారు తమ చదువులు కొనసాగిస్తూనే మరింత ఎక్కువ సమయం పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పని గంటలు పెరిగితే విద్యార్థుల చదువుపై ప్రభావం చూపొచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.