విజయవంతంగా నింగిలోకి టీశాట్- 1ఏ ఉపగ్రహం
ABN , Publish Date - Apr 09 , 2024 | 04:06 AM
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్‌సఎల్) దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన టీశాట్-1ఏ ఉపగ్రహం విజయవంతంగా పంపారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్‌సఎల్) దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన టీశాట్-1ఏ ఉపగ్రహం విజయవంతంగా పంపారు. అమెరికాలోని కెనడీ స్పేస్ స్టేషన్ నుంచి స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9- రాకెట్ ద్వారా దీన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎ్‌సఎల్), శాటిలాజిక్ సంస్థలు సంయుక్తంగా ఈ సబ్ మీటర్ ఆప్టికల్ ఉపగ్రహాన్ని కర్ణాటకలోని వెమగాల్ ఫెసిలిటీలో రూపొందించి పరీక్షించాయి. ఈ ఉపగ్రహం, తక్కువ లేటెన్సీతో అధిక రిజల్యూషన్ ఆప్టికల్ చిత్రాలను అందించనుంది. ఈ విజయం పట్ల టీఏఎ్‌సఎల్ సీఈవో సుకరన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది అంతరిక్ష రంగంలో టీఏఎ్‌సఎల్ వేసిన మొదటి అడుగని ఈ ఉపగ్రహ తయారీకి భారత ప్రభుత్వం అందించిన సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు.