Republic Day: పండ్లతో సైకతా శిల్పం.. ఆకట్టుకుంటున్న పూరీ తీరం
ABN , Publish Date - Jan 26 , 2024 | 10:15 AM
ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్(Sudarshan Patnaik) మరోసారి తన ప్రతిభతో మెప్పించారు. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సుందరమైన ఇసుక కళ(Sand Art)ను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో(X) ఓ పోస్ట్ చేశారు.
భువనేశ్వర్: ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్(Sudarshan Patnaik) మరోసారి తన ప్రతిభతో మెప్పించారు. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సుందరమైన ఇసుక కళ(Sand Art)ను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో(X) ఓ పోస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో ఒడిశాలోని పూరీ బీచ్‌లో సుందరమైన సైకతా శిల్పాన్ని రూపొందించారు. రంగులు కలిపిన ఇసుకతో, పండ్లు, పూలతో శిల్పాన్ని మలిచారు. దానిపై "హ్యాపీ రిపబ్లిక్ డే", " మేరా భారత్ మహాన్ హై" అని రాసి ఉంది. శిల్పంలో క్యాప్సికమ్, పూలు, నారింజ, నిమ్మకాయలను ఉపయోగించారు.
ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. జై హింద్, హ్యాపీ రిపబ్లిక్ డే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పట్నాయక్ ఇటీవల ఎర్రకోటలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైకతా శిల్పాన్ని చెక్కారు. ఇందుకుగాను ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని కర్తవ్య మార్గ్‌లో జెండా పండగ అట్టహాసంగా జరుగుతోంది.