Share News

Sunita Williams : ఇంకా అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్‌

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:53 AM

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఇటీవల ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకకు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమెతోపాటు మరో నాసా వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎ్‌స)లోనే చిక్కుకుపోయారు. వారిద్దరూ స్టార్‌లైనర్‌లో ఈ నెల 5న ఐఎ్‌సఎ్‌సకు

Sunita Williams : ఇంకా అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్‌

బోయింగ్‌ వ్యోమనౌకలో హీలియం లీకు.. సరిదిద్దే పనిలో నాసా

ఇద్దరు వ్యోమగాముల తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా

సునీతతోపాటు విల్‌మోర్‌ కూడా ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లోనే

2018 నుంచి పదే పదే ప్రమాదాలతో బోయింగ్‌పై విమర్శలు

ఇప్పుడు వ్యోమనౌకలోనూ లోపాలతో రోదసిలో ఇక్కట్లు!

న్యూఢిల్లీ, జూన్‌ 25: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఇటీవల ప్రయాణించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకకు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమెతోపాటు మరో నాసా వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎ్‌స)లోనే చిక్కుకుపోయారు. వారిద్దరూ స్టార్‌లైనర్‌లో ఈ నెల 5న ఐఎ్‌సఎ్‌సకు చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ఈ వ్యోమనౌకలో హీలియం లీకేజీ సమస్య తలెత్తడంతో.. నాసా ఇంజనీర్లు దాన్ని సరిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 26న వారు భూమిపైకి తిరిగొస్తారని నాసా నాలుగు రోజుల క్రితం ప్రకటించినప్పటికీ.. ఈ ప్రక్రియ మరోసారి వాయిదాపడింది. వాస్తవానికి పది రోజుల మిషన్‌ను ముగించుకుని వారు ఈ నెల 14న భూమిపైకి తిరిగి రావాల్సి ఉంది. విమానయాన రంగంలో ఘనమైన చరిత్ర ఉన్న దిగ్గజ సంస్థగా పేరొందిన బోయింగ్‌.. వరుస ప్రమాదాలతో ఇటీవలికాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2018, 2019 సంవత్సరాల్లో బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు ఘోర ప్రమాదానికి గురి కావడంతో పలు దేశాలకు చెందిన విమానయాన కంపెనీలు ఆ విమానాల వినియోగాన్ని నిషేధించాయి. దాంట్లో లోపాలను సరిచేయడంతో 20 నెలల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేశాయి. కానీ, ఆ తర్వాత బోయింగ్‌ కంపెనీకి చెందిన ఇతర మోడల్‌ విమానాలు కూడా తరచుగా ఏదో ఒక ప్రమాదానికి గురై వార్తల్లోకెక్కడంతో ఆ సంస్థ పేరెత్తితేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు.. రోదసిలో సైతం బోయింగ్‌ వ్యోమనౌక రకరకాల లోపాలతో ఇబ్బందిపెట్టడం గమనార్హం.

Updated Date - Jun 26 , 2024 | 05:53 AM